https://oktelugu.com/

KTR Arrest Campaign: అర్ధరాత్రి హైడ్రామా.. కేటీఆర్ అరెస్ట్ ప్రచారంతో ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే?

వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరయస్ గా తీసుకుంది. ఫార్మా సిటీ భూ సేకరణపై రైతుల అభిప్రాయం తెలుసుకునేందుకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో సహా అధికారులపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే.

Written By: Srinivas, Updated On : November 14, 2024 11:02 am

KTR

Follow us on

KTR Arrest Campaign: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరయస్ గా తీసుకుంది. ఫార్మా సిటీ భూ సేకరణపై రైతుల అభిప్రాయం తెలుసుకునేందుకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో సహా అధికారులపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కలెక్టర్ అని చూడకుండా కొందరుచేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలో బయటకు వచ్చాయి. దీంతో ఒక ఐఏఎస్ అధికారిపై దాడి జరగడంపై అటు ప్రభుత్వ అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ దాడికి కుట్ర పన్నారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇంటికి బుధవారం ఆర్ధరాత్రి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. అసలేం జరగిందంటే?

కలెక్టర్ దాడి పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే దాదాపు 40 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ దాడి లో ప్రధాన నిందితుడు అయిన సురేష్ కుమార్ కోసం పోలసులు గాలిస్తున్నారు. అయితే బుధవారం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు పట్నం నరేందర్ రెడ్డికి సంబంధం ఉందనే ఆరోపణలపై ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయనను విచారించగా తనకు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సలహా ఇవ్వడంతోనే ఈ దాడికి కుట్ర పన్నారని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా అరెస్టు చేస్తారన్న వార్తలు వచ్చాయి.

వాస్తవానికి పోలీసులు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియా ద్వారా ఈ వార్తలు వ్యాపించడంతో హైదరాబాద్ లోని కేటీఆర్ ఇంటికి భారీగా కార్యకర్తలు వచ్చారు. బుధవారం అర్ధరాత్రి దాటినా చాలా మంది కార్యకర్తలు అక్కడే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ కార్యకర్తలను కలుసుకున్నారు. కేటీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయనివ్వమని అక్కడున్న కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనకు కార్యకర్తలు అండగా ఉన్నారని కేటీఆర్ ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు.

ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో ఇతర జిల్లాల్లో ఉన్న కార్యకర్తలు కేటీఆర్ ను కలుసుకునేందుకు హైదరాబాద్ కు తరలివస్తుననారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో కొందరు పోలీసులు కేటీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎక్కడా అల్లర్ల జరగకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.

మరోవైపు కలెక్టర్ పై దాడి కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారిలో 19 మందికి అక్కడ అసలు భూమి లేదని, ఇది పక్కా ప్లాన్ తోనే జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు సురేష్ అరెస్ట్ అయితే అన్ని విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. కానీ ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి కలెక్టర్ దాడి ఘటన ప్లాన్ ప్రకారం చేశామని తెలిపినట్లు పోలీసులు తెలిపారు.