https://oktelugu.com/

Ambati Rambabu : అంబటి రాంబాబు చేసిన పనికి కక్కలేక మింగలేని స్థితికి వైసీపీ.. అసలేం జరిగిందంటే?

వైసీపీలో అంబటి రాంబాబు రూటే వేరు.ఈ విషయం తెలియంది కాదు. ప్రత్యర్థులపై విరుచుకు పడడంలో కూడా ఆయన శైలి ప్రత్యేకమైనది. అటువంటి అంబటి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. సొంత పార్టీ కార్యకర్తను దగ్గరుండి అరెస్టు చేయించారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 14, 2024 / 10:58 AM IST

    Ambati Rambabu

    Follow us on

    Ambati Rambabu :  వైసిపి హయాంలో సోషల్ మీడియా విభాగంలో పనిచేసిన వారిపై కేసులు నమోదవుతున్నాయి. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని పోలీసులు వెంటాడుతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే వీటిపై వైసిపి భగ్గుమంటోంది. న్యాయస్థానాలను ఆశ్రయించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్కు సైతం ఫిర్యాదు చేసింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మాజీమంత్రి అంబటి రాంబాబు వైసీపీకి షాక్ ఇచ్చారు. తన ఆశ్రయంలో ఉంటున్న వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధిని పోలీసులకు అప్పగించారు. ఈ పరిణామం వైసీపీకి ఇరకాటంలో పడేసింది. సొంత పార్టీ వైసిపి కార్యకర్తను మాజీ మంత్రి అప్పగించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పల్నాడు జిల్లా నకరికల్లులో వైసిపి సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని నూజివీడు పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో ఉండగా ఈ అరెస్టు సాగింది. తానే స్వయంగా ఆయనను పోలీసులకు అప్పగించినట్లు అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. దీంతో పార్టీలో అంబటి తీరుపై ఒక రకమైన చర్చ నడుస్తోంది.

    * నాలుగు రోజులుగా ఎస్కేప్
    నూజివీడు కు చెందిన సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డి కోసం నాలుగు రోజులుగా పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆయన మాజీమంత్రి అంబటి రాంబాబు వద్ద ఆశ్రయం పొందుతున్నారని గుర్తించారు. దీనిపై అంబటి రాంబాబుకు సంప్రదిస్తే.. చట్ట ప్రకారం ఏ స్టేషన్లో కేసులు నమోదు చేశారో చూపించి తీసుకువెళ్లాలని తానే చెప్పానని అంబటి వెల్లడించారు. ఉదయం 10:30 గంటలకు నా ఆఫీసుకు వచ్చి పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని స్వయంగా వెల్లడించారు అంబటి.సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై పోరాడిన క్రమంలో.. అంబటి చేసిన ఈ పని పార్టీ వర్గాలను సైతం విస్మయపరిచింది.

    * రౌడీలుగా మారిన పోలీసులు
    అయితే ఈ అక్రమ అరెస్టులు పై స్పందించారు అంబటి రాంబాబు. పోలీసులు కొన్నిచోట్ల రౌడీలుగా మారి వైసిపి కార్యకర్తలను కొడుతున్నారని అంబటి ఆరోపించారు. సీతారామాంజనేయులు అనే వ్యక్తి ఈ నెల 9న వైసీపీ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి పై ఫిర్యాదు చేశాడని.. హోం మంత్రి అనిత పై అసభ్యకరంగా పోస్టులు పెట్టాడని కేసు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు.అయితే ఓ టిడిపి నాయకుడు చేసిన ఫిర్యాదు పై స్పందించిన పోలీసులు.. వైసిపి నేతలు చేస్తే ఎందుకు పట్టించుకోవడంలేదని అంబటి. టిడిపికి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని కూడా నిలదీశారు. మొత్తానికైతే సొంత పార్టీ సోషల్ మీడియా కార్యకర్తను దగ్గరుండి అంబటి అరెస్టు చేయించడం మాత్రం పార్టీలో చర్చకు దారితీసింది.