Chiranjeevi- Garikapati Issue: గరికపాటి నరసింహారావు.. మొన్నటివరకూ ఈయన చెప్పే ప్రసంగాలను అందరూ విని తరించేవారు. కానీ ఒకే ఒక్క వివాదం ఈయన గతి తప్పింది. తెలంగాణలోని హైదరాబాద్ లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ ఇచ్చిన ‘అలయ్ బలయ్’ విందులో మెగాస్టార్ చిరంజీవిని అవమానించేలా మాట్లాడిన గరికపాటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి రాగానే ఆయన కోసం అభిమానులు ఎగబడడం.. సెల్ఫీలు దిగడం చూసి.. ‘అవి ఆపుతావా? నేను సభ దిగి వెళ్లిపోవాలా?’ అని అనడం చూసి అంతా షాక్ అయ్యారు.

అయితే చిరంజీవి మాత్రం వినయంగా గరికపాటికి వంగి దండాలు పెట్టి మరీ కోపగించుకోవద్దని అనునయించి తన పెద్దరికాన్ని ప్రవర్తించాడు. కానీ గరికపాటి వ్యవహారశైలి మాత్రం అందరికీ చిర్రెత్తుకొచ్చేలా ఉంది. ఈ క్రమంలోనే అసలు చిరంజీవి అంటే గరికపాటికి పడదా? ఎందుకు చిరుపై అంత కోపం అని అందరూ ఆరాతీయడం మొదలుపెట్టారు.
తీరా ఆయన పాత వీడియోలు కొన్ని తరిచి చూస్తే ఈ గరికపాటి కాలేజీ చదివే రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశాడట.. నాడు పోటీ అయిన ఏఎన్నార్ చిత్రాలు విడుదలైతే ఆ పోస్టర్ లపై పేడ కొట్టాడట.. ఇక అంతేకాదు.. ఎన్నార్ ను అవమానించాలని.. ఎన్టీఆర్ కాళ్లు మొక్కేలా ఒక ఫొటో తీసి కాలేజీలో అంటించి ఏఎన్నార్ అభిమాన సంఘం సభ్యులను అవమానించాడట.. ఇలా ఎన్టీఆర్ ను అమితంగా అభిమానించే తాను ఏఎన్నార్ ను అవమానించేలా ఫొటో రెడీ చేయించానని.. ఎన్టీఆర్ కాళ్లను ఏఎన్నార్ మొక్కకున్నా అలా తయారు చేయించి వారి అభిమానులను ఏడిపించామని గరికపాటి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

కాలేజీ రోజుల్లో తాను ఎన్టీఆర్ కు పెద్ద ఫ్యాన్ ని అని.. ఇప్పటికీ ఎన్టీఆర్ తప్ప తనకు వేరొకరు హీరోగా.. అసలు గుర్తించనంటూ అన్నారు. దీన్ని బట్టి ఎన్టీఆర్ పై ప్రేమతోనే చిరంజీవిని గరికపాటి గుర్తించలేదని.. ఆయన అహంతో ఇలా ప్రవర్తించాడని పాత వీడియోలను వెలికి తీసి మరీ కొందరు నెటిజన్లు గరికపాటిని చీల్చి చెండాడుతున్నారు.

[…] […]
[…] […]