https://oktelugu.com/

Mulugu: ములుగు అడవుల్లో గర్జించిన తుపాకులు.. భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టులు హతం..!

చాలా ఏళ్ల తర్వాత తెలంగాణలో తుపాకుల మోత మోగింది. ములుగు అడవుల్లో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్‌ సిబ్బందికి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌ జరిగింది. దీంతో అడవుల జిల్లా ఉలిక్కిపడింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 1, 2024 / 11:56 AM IST

    Mulugu(1)

    Follow us on

    Mulugu: తెలంగాణలో అడువుల జిల్లాగా గుర్తింపు ఉన్న ములుగులో సుమారు 14 ఏళ్ల తర్వాత తుపాకులు గర్జించాయి. రేపటి నుంచి(డిసెంబర్‌ 2) నుంచి మావోయిస్టు పీఎల్‌జీ సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అడవుల్లో మావోయిస్టులు సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో ములుగు ఏరియా కమిటీ సమావేశం అయింది. ఈసమాచారం అందుకున్న గ్రేహౌండ్స్‌ సిబ్బంది కూంబింగ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా మావోయిస్టులు చల్పాక అటవీ ప్రాంతంలో తారస పడడంతో ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో ఏడుగురు మాబోయిస్టులు మృతిచెందారు.

    జాయింట్‌ ఆపరేషన్‌..
    ములుగులో తెలంగాణ గ్రేహౌండ్స్‌తోపాటు యాంటీ మావోయిస్ట్‌ స్క్వాడ్‌ జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టింది. పక్కా సమాచారంలో చెల్పాక ఏరియాలో కూంబింగ్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు తెలిసింది. కీలక నేత బద్రు ఈ ఎన్‌కౌంటర్‌లో మరనించినట్లు తెలిసింది.

    ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ హతం..
    ఈ ఎన్‌కౌంటర్‌లో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఎన్‌కౌంటర్‌ తర్వాత రెండు ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలు, మావోయిస్టు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో బద్రుతోపాటు ఇల్లందు–నర్సంపేట ఏరియా కమిటీకి చెందిన మల్లయ్య, కరుణాకర్, జమున, జైసింగ్‌ తదితరులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ ఇదే అని పోలీసులు పేర్కొంటున్నారు.

    సెప్టెంబర్‌లో..
    తెలంగాణలో మావోయిస్టుల కదలికలు అంతగా లేవు. కానీ సరిహద్దులో అప్పుడప్పుడు కదలికలు ఉంటున్నాయి. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌ జరగుతున్నాయి. తెలంగాణలో గత సెప్టెంబర్‌లోనూ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భ్రద్రాద్రి–ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గుంఆల కరికగూడెం మండల పరిధిలో గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసడ్డారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో లచ్చన దళానికి చెందిన ఆరుగురు హతమయ్యారు. తాజా ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ అప్రమత్తమైంది.