https://oktelugu.com/

Mulugu: దండకారణ్యంలో తెలంగాణ పోలీసులకు పట్టు చిక్కినట్టేనా.. తాజా ఎన్ కౌంటర్లు చెబుతోంది అదేనా?

ఇటీవల కాలంలో మావోయిస్టులపై తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు వరుసగా ఎన్ కౌంటర్ చేస్తున్నారు. తాజాగా ఆదివారం ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 1, 2024 / 10:21 AM IST

    Mulugu

    Follow us on

    Mulugu: దండకారణ్యంలో పట్టు సాధించేందుకు తెలంగాణ పోలీసులు బలంగా అడుగులు వేస్తున్నారు. గ్రేహౌండ్స్ దళాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అడవుల్లో కొంతకాలంగా విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య పరస్పరం కాల్పులు జరుగుతున్నాయి. అయితే అధునాతన ఆయుధాలు కలిగిన పోలీసులు మావోయిస్టులపై పై చేయి సాధిస్తున్నారు.

    ఇటీవల కాలంలో మావోయిస్టులపై తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు వరుసగా ఎన్ కౌంటర్ చేస్తున్నారు. తాజాగా ఆదివారం ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలో చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఇటీవల దంతవాడ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 36 మంది మావోయిస్టులు చనిపోయారు. దాని తర్వాత రెండవ అతిపెద్ద ఎన్ కౌంటర్ ఇదే కావడం విశేషం. ఆదివారం తెల్లవారుజామున ఏటూరు నాగారంలోని చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు హతం అయినట్టు తెలుస్తోంది. గ్రేహౌండ్స్, మావోయిస్టు వ్యతిరేక దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ సాగించాయి.. అయితే ఈ ఎన్ కౌంటర్ పై పోలీసులు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇల్లందు – నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్న ఎన్ కౌంటర్ లో హతమైనట్టు సమాచారం. సరిగ్గా వారం క్రితం ఇద్దరు ఆదివాసీలను మావోయిస్టులు చంపేశారు. పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. వారిని మావోయిస్టులు అత్యంత కిరాతకంగా చంపేశారు. అయితే ఈ ఘటనను తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు సీరియస్ గా పరిగణించాయి. వెంటనే మావోయిస్టు వ్యతిరేక పోలీసుల దళం తో కలిసి గ్రేహౌండ్స్ బలగాలు దండకారణ్యంలో కూంబింగ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో చలపాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు.

    ఎన్ కౌంటర్ల పరంపర

    అక్టోబర్ 22న చత్తీస్ గడ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పదిమంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల వ్యతిరేక ఆపరేషన్ లో భాగంగా పోలీసు బలగాలు ఈ కార్యక్రమం చేపట్టాయి. కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ ఆధ్వర్యంలో కూలింగ్ మొదలైంది. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పదిమంది మావోయిస్టులు చనిపోయారు. సంఘటన స్థలంలో ఆటోమేటిక్ తుపాకులను, ఇతర అధునాతన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఇటీవల కాలంలో దండకారణ్యంలో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిపోయాయి. ఛత్తీస్ గడ్ రాష్ట్రం నుంచి మావోయిస్టులు తెలంగాణ సరిహద్దుల్లోకి వస్తున్నట్టు గ్రేహౌండ్స్ బలగాలు గుర్తించాయి. దీంతో దండకారణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే వరుసగా ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. తాజా ఎన్ కౌంటర్ మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ అని తెలుస్తోంది. వరుసగా కీలక నేతలను కోల్పోవడంతో మావోయిస్టులపై గ్రేహౌండ్స్ దళాలు పై చేయి సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఆపరేషన్ సమాధాన్

    కేంద్ర బలగాలు కొంతకాలంగా వామపక్ష భావజాల తీవ్రవాదాన్ని అణచివేయడానికి ఆపరేషన్ సమాధాన్ నిర్వహిస్తోంది. దీనిని వాపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. అయినప్పటికీ కేంద్ర బలగాలు దూకుడుగానే ముందుకు వెళ్తున్నాయి. దండకారణ్యంలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అధునాతన డ్రోన్ కెమెరాలు, ఆయుధాలతో మావోయిస్టులపై విరుచుకుపడుతున్నాయి. దండకారణ్యంలో పట్టు సాధిస్తున్నాయి. అంతేకాదు గతంలో జరిగిన ఎన్ కౌంటర్లకు బలమైన సమాధానాలు చెబుతున్నాయి. అయితే ఈ దాడుల పరంపర ఇక్కడితో ఆగదని.. కేంద్ర బలగాలు మరింత వేగంగా వెళ్తాయని తెలుస్తోంది. రాష్ట్ర పోలీసుల సహకారంతో కేంద్ర బలగాలు సంయుక్తంగా ఆపరేషన్లు చేపడుతున్నట్టు తెలుస్తోంది.