Malla Reddy: ఏఐ.. ప్రస్తుతం ప్రపంచమంతా దీనినే ఫాలో అవుతోంది. ఏఐ కూడా అన్నిరంగాల్లోకి చొరబడుతోంది. ఏఐతో వివిధ రంగాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే అదే ఏఐతో దుష్పరిణామాలు ఉన్నాయి. ఏఐ కారణంగా ఐటీ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. దీంతో చాలా మంది రోడ్డున పడుతున్నారు. వైద్యం రంగంలో ఏఐ మ్యాజిక్ చేస్తోంది. చికిత్సలో ఆధునికత వస్తోంది. అయితే ఈ ఏఐ గురించి మన మల్లారెడ్డి ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడిన మాటలు ఇప్పుడు నవ్వులు పూయిస్తున్నాయి.
ఏఐకి అన్నీ చెప్పాలట..
మల్లారెడ్డి అంటేనే ఒక సక్సెస్ఫుల్ లీడర్ గుర్తొస్తారు. కష్టపడి ఎదిగిన నేత. వ్యాపారంలో, విద్యారంగంలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఇక మంత్రిగా, రాజకీయ నేతగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఏడు పదుల వయసు దాటినా.. చురుకుగా కనిపిస్తారు. డ్యాన్స్‌లు వేస్తూ విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతారు. అయితే ఇటీవల ఆయన ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐ గురించి మాట్లాడారు. ఏఐకి మనం చేసే పనులు, వ్యాయాం తీసుకునే ఆహారం, వేసుకునే మందుల గురించి చెబితే మన ఆరోగ్యం గురించి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తుందని పేర్కొన్నారు.
మన డెత్ డేట్ కూడా..
ఇక చివరగా మల్లారెడ్డి తనదైన శైలిలో పంచ్ వేశాడు. యాంకర్‌నే ఏఐ గురించి మీకు తెలుసా అని ప్రశ్నించారు. యాంకర్ మీరే చెప్పండి అనడంతో అనేక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా అన్ని వివరాలు చెబితే మన డెత్ డేట్ కూడా ఏఐ చెబుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుపడు వైరల్ అవుతోంది.
స్పందిస్తున్న నెటిజన్లు..
మల్లారెడ్డి ఇంటర్వ్యూపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మల్లారెడ్డికి ఏఐ గురించి తెలుసు కానీ, చెప్పడం రాలేదని కొందరు కామెంట్ చేశారు. కొందరు మల్లారెడ్డిని అవమానిస్తున్నారని పోస్టు చేశారు. కొందరేమో మల్లారెడ్డి చెప్పింది నిజం.. అందుకే నిపుణులు ఏఐతో ప్రమాదం అని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా కొందరు మల్లన్న తన బ్యాంకు పాస్వార్డ్ కూడా ఏఐకి చెప్పాడేమో అని వ్యంగ్యంగా కామెం చేశారు.
AI is the most powerful Technology – feat by Malla Reddy. pic.twitter.com/pPTl9V96Mh
— (@Sagar4BJP) December 3, 2025