Crime News: అదనపు కట్నం కోసం మరో అబల బలైంది. వరకట్న వేధింపులతో నిండు జీవితాన్ని చిదిలం చేసుకుంది. తోడుగా నిలవాల్సిన వాడే తోడేళ్లలా పీక్కుతింటుంటే భరించలేని ఆమె తనువు చాలించింది. భర్త ఇంటి వారి బాధలు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఎవరు ఎన్ని అన్నా కట్టుకున్న వాడు తోడుంటే ఆమెకు ఎంతో బలం ఉండేది. కానీ అతడే ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని భార్యను నిత్యం వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఏమి చేయలేని ఆమె తన జీవితం ఎందుకని భావించుకుని ఉరి వేసుకుని చనిపోవడం సంచలనం రేపుతోంది.
దుబ్బాకకు చెందిన దోర్ల శోభ, వెంకటరెడ్డిల కూతురు ప్రవళిక (28) చదువుకునే సమయలోనే నిజామాబాద్ జిల్లా బోర్గాం (పి) గ్రామానికి చెందిన చామకూర మహేశ్ ను ప్రేమించింది. దీంతో ఇద్దరు కలిసి పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో ఐదేళ్లు వీరి సంసారం సజావుగానే సాగింది. మహేశ్ మిషన్ భగీరథలో పొరుగు సేవల విభాగంలో విధులు నిర్వహించేవాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఉద్యోగం పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. ఈ నేపథ్యంలో అదనపు కట్నం కావాలని వేధించడం మొదలు పెట్టాడు.
Also Read: నువ్వేంటి తల్లి ఇలా ఉన్నావ్.. ఆర్టీసీ డ్రైవర్‌ను ఇలా కొడతావా..!
ఆరునెలల క్రితం కూతురు బాధ చూడలేని తల్లిదండ్రులు రూ. 4 లక్షల వరకు ఇచ్చారు. అయినా ఇంకా కావాలని డిమాండ్ చేయడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మనాన్నలు కూడా కూతురు కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయేవారు. దీంతో ఇక తాను జీవించి ఉండటం కష్టమని భావించి చావే శరణ్యమని కన్నీటి పర్యంతమైంది. తనకు భవిష్యత్ లేదని తన భర్త వల్ల ఇంకా ఎన్ని బాధలు పడాలో అర్థం కాని పరిస్థితిలో ఇక బతకడం ఎందుకని రోదించింది. చివరకు ఆ*** చేసుకోవాలని నిర్ణయించుకుంది.
ఇదే అదనుగా భావించి ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. దీంతో భర్త చామకూర మహేశ్, అత్త చామకూర రాజవ్వ, సమీప బంధువులైన మేనత్త, మేనమామపై కేసు నమోదు చేశారు. అదనపు కట్నం కోసం వేధించడంతోనే ఆమె ఆ**** చేసుకుందని ప్రవళిక తల్లి ఫిర్యాదు మేరకు వారిపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అదనపు కట్నం ఆశతో ప్రవళిక చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెల్లవారక ముందే తెల్లారిన ఆమె మరణానికి కారకులను చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నారు.
అదనపు కట్నం వేధింపులతోనే తాను ఆ**** చేసుకుంటున్నానని సూ*^&& నోటు రాసింది. అమ్మానాన్న క్షమించాలని కోరింది. లెటర్ చదివిన తల్లిదండ్రులు కన్నీటి పర్యటంతమయ్యారు. తన కూతురు చావుకు కారకులను విడిచిపెట్టేది లేదని చెబుతున్నారు.
Also Read: ఐపీఎల్ 2022 మెగావేలం: సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఇదే