HomeతెలంగాణLand Grabbing : కరీంనగర్ కు కావాలి ఒక కాడ్రా ల్యాండ్ గ్రాబింగ్ అడ్డుకట్టకు ప్రత్యేక...

Land Grabbing : కరీంనగర్ కు కావాలి ఒక కాడ్రా ల్యాండ్ గ్రాబింగ్ అడ్డుకట్టకు ప్రత్యేక వ్యవస్థ..అక్రమార్కుల్లో వెన్నులో వణుకు పుట్టేలా.. 

Land Grabbing :  కంచే చేను మేసినట్లు.. ప్రభుత్వాస్తులను రక్షించే వారే భక్షించారు.. గత పాలనలో కోట్లాది రూపాయల భూములను చెరబట్టారు. పేదలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. తిరిగి వారి పైనే పోలీసులు కేసు నమోదు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీన్ రివర్స్ అయింది.. పేదల భూములు కబ్జా చేసిన పలువురు కటకటాల పాలయ్యారు. అలాగే ప్రభుత్వం భూముల పరిరక్షణకు కాడ్రా ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తున్నది. కరీంనగర్లో భూముల కబ్జా.. హైడ్రాలాగా కాడ్రా ఏర్పాటు ఎందుకు.. తాజా పరిస్థితి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..

బీఆర్ఎస్ హయంలో ఆడిందే ఆట. పడిందే పాట..

బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో వారు వాడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఎవరైనా అడ్డు చెబితే అంతే సంగతులు. గతంలో ఒక మంత్రిగా వ్యవహరించిన ముఖ్య నేత పేరు చెప్పుకొని అనుచరు సాగించిన అరాచకం అంతా కాదు. కోట్లలో ఉండే ప్రభుత్వ భూములతో పాటు పేదల భూములను కూడా చెరపడ్డారు. ఎదురు తిరిగిన వారిపైనే తమకున్న పలుకుబడిని ఉపయోగించి ఉల్టా కేసులు నమోదు చేయించి జైలు పాలు చేశారు. పదేళ్ల కాలం పాటు వారి హవా కొనసాగింది. పోలీసులు, అధికారులు కూడా కిమ్మనకుండా అడ్డు చెప్పలేకపోయారు. ప్రభుత్వం మారింది.. సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల కబ్జాపై ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాదులో వేల కోట్ల రూపాయల చెరువులు, కుంటలు ఇతర ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. వీటి పరిరక్షణతో పాటు ఇకముందు కూడా కబ్జా కాకుండా ఇతర దేశాలో అధ్యయం చేసిన తర్వాత హైడ్రాను అనే ప్రత్యేక ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. దానికి సంపూర్ణ అధికారాలు అప్పగించారు. చెరువులు, కుంటలు ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో చేపట్టిన అక్రమాణలపై హైడ్రాధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు.

ఆక్రమణదారులకు సిపి సింహ స్వప్నం..

బీఆర్ఎస్ హయంలో కరీంనగర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతమైన భూకబ్జాలు జరిగాయి. పేదలు సామాన్యులను సైతం నానా ఇబ్బందులకు గురిచేసి వారి భూములను సైతం చెర పెట్టారు.
ప్రభుత్వ స్థలాల్లో అక్రమణాలపై ఉక్కు పాదం మోపుతున్న హైదరాబాద్ హైడ్రా లాగా కరీంనగర్ కు ఒక కాడ్రా ఏర్పాటు చేయాలని అంశం ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్రభుత్వాస్తుల పరిరక్షణ, కబ్జాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అనే ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. చెరువులు, కుంటల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతున్నది. గత బిఆర్ఎస్ పాలనలో కరీంనగర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విచ్చలవిడిగా భూములు కబ్జాకు గురయ్యాయి. అడ్డు అదుపు లేకుండా వేలకోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతమ య్యాయి. గతంలో మంత్రిగా వ్యవహరించిన ముఖ్య నేతతో పాటు ఇతర నేతలు ఇందులో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు సంబంధించిన ప్లాట్లను సైతం చెరబట్టారు. వారిని ముప్పు తిప్పలు పెట్టారు. పేదలు సిపి అభిషేక్ మహంతికి ఫిర్యాదు చేయడంతో కొందరు నాయకులు, కార్పొరేటర్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కరీంనగర్ చరిత్రలో కబ్జాల పర్వం సంచలనం సృష్టించింది. దీంతో పాటు అనేక ఫిర్యాదులు భూకబ్జాలపైనే వస్తున్నాయి.

కరీంనగర్ కు కావాలి ఒక కాడ్రా

హైదరాబాదులో ఏర్పాటు చేసిన హైడ్రాలాగా కరీంనగర్లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు కాడ్రా (కరీంనగర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ) ని ఏర్పాటు చేయాలని డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నది. హైదరాబాదులో కబ్జాదారులపై పాదం మోపుతున్న హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. కరీంనగర్లో సైతం ఏర్పాటు చేస్తే ఆక్రమణదారులకు చుక్కలు తప్పవనే సమాధానం వినిపిస్తున్నది. ఎల్ఎండి రిజర్వాయర్ సమీపంలో ఎస్సారెస్పీకి సంబంధించిన భూములు కబ్జాకు గురయ్యాయి. అదేవిధంగా భూములకు రెక్కలు రావడంతో కరీంనగర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో చెరువులు, కుంటల్లో ప్రభుత్వ భూములను సైతం గత పాలనలో చెరబట్టారు. పేదల ఇండ్లను సైతం ధ్వంసం చేసిన ఘటనలు కరీంనగర్ లో ఉన్నాయి. పైసా పైసా కూడబెట్టుకొని పేదలు ఇళ్ల స్థలాలు కొనుక్కుంటే వారివి సైతం కబ్జా చేశారు. తిరిగి వారి పైన కేసులు పెట్టి జైలు పాలు చేశారు. వీటి విరుగుడుకు కరీంనగర్లో కాడ్రా ఏర్పాటు చేయాలని, దీంతో అటు ప్రభుత్వ భూములు ఇటు సామాన్యుల భూములకు రక్షణ ఉంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో కొంత ధైర్యం కల్పించిన వారవుతారని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఇదే అంశంపై ఆదివారం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో కరీంనగర్ లో కాడ్రా ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇది మంచి నిర్ణయం ప్రజలు స్వాగతించి తీరాల్సిందే.. ఏది ఏమైనా హైడ్రా కరీంనగర్ లోను ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. కాడ్రా ఏర్పడితే మాత్రం అక్రమార్కులా వెన్నులో వణుకు పుట్టే అవకాశం ఉంది. చూద్దాం మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో కొద్దిరోజులు వెయిట్ చేయాలి మరి..

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular