అయితే అక్కినేని నాగార్జున నిన్న ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, కట్టివేత కూల్చడం పై హై కోర్టు స్టే విధించిందని, నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం మాత్రం స్టే ఇచ్చారు అనేది పూర్తిగా అవాస్తవం అని తేల్చి చెప్పేసారు. దీనికి నాగార్జున నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో, జనాలు నాగార్జున వైపు నుండే తప్పు ఉన్నట్టుగా భావిస్తున్నారు. మరి ఆయన ప్రెస్ మీట్ ద్వారా హై కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ని మీడియా ముందు పెడుతాడా?, లేకపోతే ఈ ఘటన ని ఇక్కడితో వదిలేసి తన పని తాను చూసుకుంటాడా అనేది చూడాలి. ఇది ఇలా ఉండగా నాగార్జున సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ షూటింగ్ కి సిద్ధం అవుతున్నాడు. మంగళవారం నుండి ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి.
నిన్న, మొన్న మొత్తం కంటెస్టెంట్స్ కి సంబంధించిన స్పెషల్ ఏవీ వీడియోస్ ని షూట్ చేసారు. శుక్రవారం రోజు బిగ్ బాస్ లాంచ్ కి సంబంధించిన చిన్న ప్రోమో వీడియో ని విడుదల చెయ్యబోతున్నారు. ఇలా మూడు నెలల పాటు నాగార్జున బిగ్ బాస్ షోతో బిజీ కానున్నాడు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుభేర’ అనే చిత్రం చేస్తున్నాడు. లవ్ స్టోరీ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ గా ఏర్పడ్డాయి.