Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ 3న నోటిషికేషన్ ఇవ్వనున్నట్లు ఈసీ ప్రకటించింది. అదేనెల 30న ఎన్నికలు నిర్వహిస్తారు. డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికలకు అధికార బీఆర్‌ఎస్‌తోపాటు విపక్ష కాంగ్రెస్, బీజేపీ సమాయత్తం అవుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. సంక్షేమాన్నే నమ్ముకుంది. అదే సంక్షేమంతో ఈసారి బీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీ స్కీంలు ప్రకటించింది. ఆరు స్కీంలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాయని నమ్ముతోంది. ఇక బీజేపీ కూడా అధికార బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటుంది. ప్రజారంజక మేనిఫెస్టో రూపొందిస్తోంది. అయితే తెలంగాణలో వరుసగా 2014, 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్.. కేవలం హరీశ్‌రావు, కేటీఆర్ మాత్రమే లక్షకుపైగా మెజారిటీ సాధించారు. సీఎం కేసీఆర్ కూడా గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి బలమైన ప్రత్యర్థులు లేనందున బీఆర్‌ఎస్ భారీ మెజారిటీపై గురిపెట్టింది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని విపక్ష కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్‌ఎస్‌ను గద్దె దించుతామంటోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలో పునరావృతం అవుతాయని కాంగ్రెస్ లెక్కలు వేస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ ఒక అడగు ముందుకు వేసి డిసెంబర్ 9న ఎల్‌బీ స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తాడని కూడా ప్రకటించారు. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయం పక్కన పెడితే… మెజారిటీ ఈసారి లక్ష దాటేది ఎవరన్న చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది.
గత ఎన్నికల్లో ఇద్దరే..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఇద్దరు మాత్రమే లక్షకుపైగా మెజారిటీ సాధించారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్, సిద్దిపేట నుంచి హరీశ్‌రావు లక్షకుపైగా మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. కొంతమంది 50 వేలకుపైగా మెజారిటీ సాధించారు. కాని లక్ష మార్కును ఎవరూ రీచ్ కాలేదు. ఈసారి లక్ష మార్కును హరీశ్, కేటీఆర్‌తోపాటు ఇంకా ఎవరైనా చేరుతారా అన్న చర్చ జరుగుతోంది.
50 వేలు దాటింది వీరే..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రమే 50 వేలకుపైగా మెజారిటీ సాధించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ 61,185 మెజారిటీతో జీవన్‌రెడ్డిపై గెలిచారు. కేటీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కేకే.మహేందర్‌రెడ్డిపై 89,009 ఓట్లతో గెలిచారు. నారాయణఖేడ్ నుంచి భూపాల్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌పై 58,508 ఓట్ల మెజారిటీ సాధించారు. దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వర్‌రెడ్డిపై 62,500 మెజారిటీతో గెలిచారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిపై 58,290 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మేడ్‌చల్ నుంచి మల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగాలి లక్ష్మారెడ్డిపై 87990 ఓట్లు సాధించారు. మైనంపల్లి హన్మంతరావు కూడా మల్కాజ్‌గిరి నుంచి 73,698 ఓట్ల మెజారిటీ సాధించారు. రాజేందద్రనగర్ నుంచి ప్రకాశ్‌గౌడ్ కూడా 58,373 ఓట్ల తో గెలిచారు. కార్వాన్ ఎమ్మెల్యే ఎంఐఎం తరఫున 50,169 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎంఐఎంకే చెందిన అక్బరుద్దీన్ చాంద్రాయణగుట్ట నుంచి బీజేపీ అభ్యర్థిపై 80,264 ఓట్లు మెజారిటీ సాధించారు. బహదూర్‌పురా నుంచి మహ్మద్ మోజమ్‌ఖాన్ కూడా ఎంఐఎం నుంచి టీఆర్‌ఎస్‌పై 82,518 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిపై 57,775 ఓట్ల మెజారిటీ సాధించారు. వనపర్తి నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిపై 51,685 ఓట్ల మెజారిటీ సాధించారు. నాగర్‌కర్నూల్ నుంచి మర్రి జనార్దన్‌రెడ్డి 54,354 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా 53,053 ఓట్ల మెజారిటీ సాధించారు. వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేశ్ 99,240 లీడ్‌తో గెలిచారు. హరీశ్‌రావు తర్వాత ఈయనే బీఆర్‌ఎస్‌లో అత్యధిక మెజారిటీ.
ఈసారి ఆ ఇద్దరే..
ఈసారి కూడా కేటీఆర్, హరీశ్‌రావు మాత్రమే లక్ష మార్కు మెజారిటీ చేరతారని తెలుస్తోంది. ఆరూరి రమేశ్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. గత ఎన్నికల్లో సంగం మెజారిటీ కూడా రాదంటున్నారు. కేసీఆర్‌పై ఈసారి ఈటల బరిలో దిగితే కేసీఆర్ కూడా గత మెజారిటీని చేరుకోవడం కష్టమంటున్నారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ గట్టి పోటీ ఇస్తారని తెలుస్తోంది. ఎంఐఎం అభ్యర్థులు, బీఆర్‌ఎస్ నుంచి మల్లారెడ్డి మాత్రమే లక్షకు చేరుకునే అవకాశం ఉంది.