KTR Son Himanshu: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు మనవడు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షురావు తండ్రిలానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇక తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన పోస్ట్‌ను చూసి షాక్ ట్వీట్ చేసిన నెటిజన్ ట్వీట్‌కు తనదైన శైలిలో రిప్లయ్ ఇచ్చాడు హిమాన్షు. బాలకృష్ణ డైలాగ్‌ను కోట్ చేస్తూ హిమాన్షు ఇచ్చిన రిప్లయ్.. ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.

-బాలకృష్ణ డైలాగ్‌ను కోట్ చేసి..
తన శరీరాకృతిపై దృష్టి పెట్టిన హిమాన్షురావు ఫిట్నెస్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చాలా బరువు తగ్గారు. ఇక ఇదే క్రమంలో తాజాగా ఒక నెటిజన్ హిమాన్షురావు ఇటీవల దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేసి, సడన్‌గా చూసి కేటీఆర్ అన్న అనుకున్నా అంటూ ఆ ఫొటో క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేశారు. ఇక ఆ పోస్టు చూసి హిమాన్షు బాలకృష్ణ డైలాగ్ కోట్ చేసి సదరు నెటిజన్ కు సమాధానమిచ్చారు. ఇక అందులో హిమాన్షురావు ‘‘సరె సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్ని జరుగుతాయా ఏంటీ’’ అని ఒక మహానుభావుడు చెప్పాడని పేర్కొని, సరే జోకులు తర్వాత… ధన్యవాదాలు’’ అంటూ పోస్ట్ చేశారు.
-హిమాన్షు.. ఆ రహస్యం చెప్పమంటున్న.. నెటిజన్లు
హిమాన్షు తాజా ఫొటో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజంగానే హిమాన్షు సేమ్ టు సేమ్ కేటీఆర్ లాగే ఉన్నారంటూ కామెంట్ చేశారు. హిమాన్షు పోస్టుకు నెటిజన్లు లైకులు కొడుతున్నారు. రీట్వీట్‌లు చేస్తున్నారు. అంతేకాదు హిమాన్షు ఇంతగా మారడం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పాలని చాలా మంది పోస్టులు పెడుతున్నారు.

-బాడీ షేమింగ్‌పై అప్పట్లో రగడ..
హిమాన్షురావు.. అనేక సందర్భాల్లో అధిక బరువు కారణంగా బాడీ షేమింగ్‌కు గురయ్యారు. భారీ శరీరాకృతితో ఉన్న హిమాన్షురావును చాలామంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యర్థి పార్టీల నేతలు చాలా సందర్భాలలో హిమాన్షు శరీరాకృతి గురించి వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో తీవ్రంగా స్పందించారు. బహిరంగంగానే కుమారుడి బాడీ షేమింగ్‌పై చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.
A great man once said "sarsarle ennenno anukuntam, anni jaruguthaaya enti". 😁😁
Jokes apart, Thank youu🥰 https://t.co/dwt8VZ9FmP
— Himanshu Rao Kalvakuntla (@TheHimanshuRaoK) November 14, 2022