KTR : తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు అధికారం అప్పగించారు. ఐదేళ్లు తెలంగాణ పునర్నిర్మాణంతోపాటు అనేక సమస్యలపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. తర్వాత 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన గులాబీ బాస్‌ను మరోమారు 2014 ఎన్నికల కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపించారు. ఇదే ఆ పార్టీ నేతల అహంకారం పెంచింది. తాము ఏది చెబితే అది చేస్తారు తెలంగాణ ప్రజలు అన్నట్లుగా రెండోసారి అధికారం చేపట్టాక ఇష్టానుసారం, అహంకారపూరితంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. ఎన్నికల హామీలను పట్టించుకోలేదు. ఇక ఇస్తామన్న హామీలు ఇవ్వలేదని చెప్పడం నేర్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నియామకాల అంశాన్ని పట్టించుకోలేదు. దీంతో యువతలో తీవ్ర ఆగ్రహం పెరిగింది. ఈ క్రమంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. బీఆర్‌ఎస్ నేతల అహంకారం దిగేలా తీర్పు ఇచ్చారు. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ను ప్రతిపక్షానికి పరిమితం చేశారు.
అసెంబ్లీకి రాని గులాబీబాస్..
అధికారంలో ఉన్నప్పుడు తాను ప్రభువును అన్నట్లు కేసీఆర్, తాను యువ రాజును అన్నట్లు కేటీఆర్ వ్యవహించారు. హరీశ్‌రావు, కవిత, ఎంపీ సంతోష్, ఇలా చాలా మంది కుటుంబ సభ్యులే తెలంగాణపై అధికారం చెలాయించారు. అయితే ఓడిపోయిన తర్వాత కేసీఆర్, కవిత, సంతోష్ కనిపిచండం లేదు. కేటీఆర్, హరీశ్‌రావులే అన్నీతామై వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌ను బీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. స్పీకర్ కూడా ప్రతిపక్ష నేతగా గుర్తించారు. అయినా ఆయన గడిచిన ఏడాది కాలంలో కేవలం ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. తర్వాత ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను కేటీఆర్, హరీశ్‌రావే ఎండగడుతున్నారు. అసెంబ్లీలోనీ వీరే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
తాత్కాలిక బ్రేక్ అంటూ ట్వీట్..
ఇలా ఏడాది గడిచింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ అంటూ ఓ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటానని అందులో పేర్కొన్నాడు. తాను రీఫ్రెష్ అవ్వాలనుకుంటున్నానని, అందకే కొన్ని రోజులు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని తెలిపారు. అయితే తాను యాక్టివ్‌గా లేనని తన రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్సవ్వరని అనుకుంటున్నా అని ట్వీట్‌లో చమత్కరించారు. ఈ ట్వీట్‌కు ఓ స్మైలింగ్ ఏమోజీని జోడించారు.
నెటిజన్ల కామెంటు..
కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీ బదులు మేం బ్యాటింగ్ చేస్తాం.. వాళుల మిస్ అవకుండా చూసుకుంటాం అని ఒకరు కామెంట్ చేశారు. బాగా రిఫ్రెష్ అయి.. ఫుల్ ఎనర్జీతో రండి అని మరొకరు.. బ్రేక్ మీకు కానీ, మీ ప్రత్యర్థులకు కాదు.. మేం వదలం అని ఇంకొకరు ఇలా రకరకాలుగా పోస్టు పెడుతున్నారు.
నోరు అదుపు తప్పుతున్నందుకేనా..
కేటీఆర్ కొన్ని రోజులుగా మాటలు తూలుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చాలా పొలైట్‌గా మాట్లాడేవారు. ప్రతిపక్షంలోకి వచ్చాక అధికారంలో లేమనే అసహనం, కోపం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అధికార కాంగ్రెస్‌ను, సీఎం రేవంత్‌రెడ్డిపై ఒంటికాలితో లేస్తున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం పదవికి అన్న విలువ ఇవ్వరా అని ప్రశ్నించిన కేటీఆర్.. ఇప్పుడు ఆయన కూడా సీఎం పదవికి విలువ ఇవ్వడం లేదు. పొట్టోడు, టిల్లుగాడు, జోకర్ అంటూ రేవత్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సిరిసిల్ల కలెక్టర్‌పైనే నోరు జారారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారులు ఖండించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో తాను అదుపు తప్పి మాట్లాడుతున్నట్లు గుర్తించి.. సరిచేసుకునేందుకే రెస్ట్ తీసుకుంటున్నారని కొందరు పార్టీ నేతలే పేర్కొంటున్నారు.
కవిత యాక్టివ్..
ఇదిలా ఉంటే.. కేసీఆర్ కూతురు, కేటీఆర్ చెల్లి కవిత మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అవుతున్నారు. లిక్కర్ కేసులో ఆరు నెలలు జైల్లో ఉన్నా ఆమె.. బెయిల్‌పై బయటకు వచ్చారు. దాదాపు మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా ఆమె మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారని మరికొందరి అభిప్రాయం.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ktrs sensational decision that gave him a break from politics what is the reason
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com