Revanth Reddy VS KTR : తెలంగాణలో మళ్లీ సవాళ్ల రాజకీయం(Challenging Politics) మొదైలంది. ఎన్నికలకు ముందు, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్, కేటీఆర్‌కు సవాళ్లు విసిరేవారు. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రజాసమస్యలపై, ప్రభుత్వ నిర‍్ణయాలు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై నిత్యం నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో రుణమాఫీ, ఇందిర్మ లబ్ధిదారల ఎంపిక, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఆరు గ్యాంరటీలు, 420 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ సవాళ్ల రాజకీయం మొదలు పెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అన్ని హామీలు నెరవేర్చి ఉంటే.. సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలన్నారు. అక్కడి నుంచి తమ పార్టీ తరఫున పట్నం నరేందర్‌రెడ్డిని బరిలో దించుతామని ఆయన ఎలాంటి ప్రచారం చేయరని, బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది నేతలు మాత్రమే ప్రచారం చేస్తారన్నారు. ఇక రేవంత్‌రెడ్డి ఎంతైనా ప్రచారం చేసుకోవచ్చన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి(Narendar Reddy) 50 వేలకు తక్కువ కాకుండా మెజారిటీతో విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. అలా జరగని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.
రైతు నిరసన దీక్ష..
రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేర్చడం లేదని కొడంగల్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష సోమవారం(ఫిబ్రవరి 10న) చేపట్టారు. ఈ దీక్షకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. తెలంగాణలో ఏడాదిగా కౌరవ పాలన నడుస్తోందన్నారు. ఇక కొడంగల్(Kodangal)లో కురుక్షేత్ర యుద్ధమే జరుగుతోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రేవంత్‌రెడ్డి రైతులకు, మహిళలకు, వృద్ధులకు, యువతకు చేసిందేమీ లేదన్నారు. అనుముల అన్నదముమలు అదానీ కోసం పనిచేస్తున్నారని విమరి‍్శంచారు. రేవంత్ సీఎం అయితే తమకు మంచి జరుగుతుందని కొడంగల్ ప్రజలు ఆశించారని, కానీ, రేవంత్ సొంత నియోజకవర‍్గ ప్రజలను కూడా మోసం చేశారని ఆరోపించారు. ఇక్కడి రైతుల భూములను కూడా లాక్కునే ప్లాన్ చేశారన్నారు.
రాజకీయ సన్యాసం అని రెచ్చగొడుతూ..
అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ కేటీఆర్ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు. ఆయన 2024, డిసెంబర్ 21న కూడా అసెంబ్లీ వేదికగా ఇలాంటి సవాల్ చేశారు. రైతు భరోసా అంశంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి ఈ సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో ఒక్క కలం పోటుతో రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచిన తర్వాత రుణామాఫీకి రూ.49.5 వేల కోట్లు అవసరమని చెప్పారన్నారు. తర్వాత దానిని రూ.40 వేల కోట్లకు, మరోసారి రూ.31 వేల కోట్లకు తగ్గించారని వెల్లడించారు. చివరకు రూ.19 వేల కోట్లు మాత్రమే చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికైనా వెళ్లి రుణమాఫీ పూర్తిస్థాయిలో జరిగిందో లేదో తెలుసుకుందామన్నారు. మళ్లీ ఇప్పుడు అదేతరహా ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ సవాళ్లపై సీఎం రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.
రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
దుమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఇక్కడికి రా.. ఎవరు గెలుస్తారో చూద్దాం – కేటీఆర్ pic.twitter.com/UZhuhMWwiD
— Telugu Scribe (@TeluguScribe) February 10, 2025