KTR(5)
KTR: ఏ పార్టీ అధికారంలో ఉన్నా వివిధ పథకాలు, కార్యక్రమాలు చేస్తాయి. అధికారం కల్పోయాక వాటిలోని లోపాలపై కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు విచారణ జరిపిస్తున్నాయి. కేసులు నమోదు చేస్తున్నాయి. అరెస్టులు కూడా చేస్తున్నాయి. ఈ సంస్కృతి గతంలో తమిళనాడులోనే ఉండేది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సంప్రదాయమే కొనసాగుతోంది. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్(BRS) పార్టీ హయాంలో జరిగిన ఒప్పందాలు, వాటిలో జరిగిన అక్రమాలు, నాసిరకం నిర్మాణాలు, ఫోన్ ట్యాపింగ్(Phone Taping) వంటి వ్యవహారాలపై విచారణ జరుగుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో విదేశీ సంస్థకు రూ.56 కోట్లు కేటాయించడంపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గొర్రెల పంపిణీ పథకంలోనూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణ జరుగుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ఆయనను ఏసీబీతోపాటు ఈడీ కూడా విచారణ చేశాయి. మళ్లీ విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది.
పరిష్కార మార్గం చెప్పిన కేటీఆర్..
ఫార్ములీ ఈ రేస్‌కేసులో ఈడీ విచారణకు వెళ్లిన కేటీఆర్(KTR) బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఓ కీలక సూచన చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అయినా ధైర్యంగా ఎదుర్కొంటానని ప్రకటించారు. అదే సమయంలో కేసుల పరిష్కారానికి ఇద్దరం జడ్జి ముందు కూర్చుందామని, ఇద్దరికీ లైడిటెక్టర్(Ly Detector) పరీక్ష చేయించుకుందామని తెలిపారు. దీంతో నిర్దోషి ఎవరో దోషి ఎవరోతేలిపోతుందని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్‌పై తనపై పెట్టిన కేసు విచారణ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నారని, అంతా వృథాయే అని విమర్శించారు. కోట్లు పెట్టి దర్యాప్తు చేయించడం కన్నా.. లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుందామని, మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసి తప్పు ఎవరిదో తేల్చుకుందామని సవాల్ చేశారు.
రెండు మూడురోజుల్లోనే పరిష్కారం..
కేటీఆర్ చేసిన ప్రకటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దేశంలో చట్టాలు చాలా స్లోగా ఉన్నాయని, విచారణ ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని పరిస్థితి నేపథ్యంలో కేటీఆర్ ఐడియా బాగుందని చాలా మంది అభిప్య్రాపడుతున్నారు. ఇలా నేతలందరూ లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుంటే రెండు మూడు రోజుల్లోనే చాలా కేసులు పరిష్కారం అవుతాయని పేర్కొంటున్నారు.
లాజిక్ మిస్ అయిన కేటీఆర్..
ఇదిలా ఉంటే.. కేటీఆర్ ఐడియా బాగానే ఉన్నా.. ఎవరి కేసు వారిది. లై డిటెక్టర్ పరీక్షలకు మన చట్టాలు అంగీకరించవు. చట్టం, రాజ్యాంగం ప్రకారం.. దర్యాప్తులు జరుగుతాయి. అయినా ఇక్కడ కేసులు ఉన్నది రేవంత్ తప్పు చేశాడా.. లేక కేటీఆర్ తప్పు చేశాడా అని కాదు.. ఎవరి కేసులు వారివే. ఈ లాజిక్ తెలియకుండానే కేటీఆర్ సంచలనం కోసం ఓ ప్రకటన చేశాడు. ఈడీ కేసులు రేవంత్ పెట్టిస్తున్నాడని, ఆయనే దర్యాప్తు చేయిస్తున్నాడని కేటీఆర్ భావిస్తే ఆయనకు పెద్ద ఎలివేషన్ ఇచ్చినట్లే.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ktr super formula if you do that all the cases will be finished
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com