KTR Son Himanshu: కేటీఆర్.. తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన కొడుకుగా.. కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమైన మంత్రిగా పనిచేవారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెడిసెంట్‌గా బాధ్యతలు చూసుకుంటున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నారు. కేటీఆర్ వారసుడు.. కేసీఆర్ మనుమడు.. కల్వకుంట్ల హిమాన్షు కూడా 2023 ఎన్నికల సమయంలో పార్టీ తరఫున ప్రచారం చేశారు. అయితే చాలా మందికి ఆయన కేసీఆర్ ద్వారానే పరిచయం అయ్యాను. ముఖ్యమంత్రిగా ఏ కార్యం తలపెట్టినా మనుమడిని వెంట తీసుకెళ్లేవారు. భద్రాద్రి సీతారాముల కళ్యానానికి మనుమడితో తలంబ్రాలు పంపించారు. ఇది అప్పట్లో వివాదాస్పదమైంది. ఇదంతా ఎందుకంటే.. ఆ హిమాన్స్ ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నాడు. రాష్ట్రంలో చదువుకుంటున్న మయంలోనే ప్రతిభ చాటుకున్నాడు. ఇప్పుడు అమెరికాలో.. సొంతంగా ఉద్యోగం సాధించాడు.
స్టూడెంట్ నుంచి ఉపాధ్యాయుడిగా …
అమెరికాకు స్డూడెంట్‌గా వెళ్లిన హిమాన్షు ఇప్పుడు.. అక్కడే ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాడు. తరగతి గదిలో విద్యార్థిగా ఉన్నప్పటి నుండి ఉపాధ్యాయుడిగా మారిన దశ ఆశ్చర్యకరమైనది, ఇది వ్యక్తిగతంగా ప్రత్యేక అనుభూతిని కలిగిందని హిమాన్షు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇక తన తొలి ఉద్యోగం అనుభవాన్ని లింక్డ్ ఇన్‌లో పోస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
స్పందిస్తున్న నెటిజన్లు..
హిమాన్షు పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తండ్రికిదగ్గ తనయుడు అని పోస్టులు పెడతున్నారు. గతంలో కేటీఆర్ కూడా అమెరికాల జాబ్ చేశాడని, తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని, హిమాన్షు కూడా అమెరికాలో జాబ్ కొట్టాడని.. భవిష‍్యత్‌లో తెలంగాణ రాజకీయాల్లో రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలా మంది హిమాన్షుకు ఆల్ దిబెస్ట్ చెబుతూ పోస్టులు పెట్టారు.
అమెరికాలో ఉన్నత విద్య పూర్తిచేసి, ఉద్యోగంలో అడుగుపెట్టడం హిమాన్షు కృషి, నేర్చుకునే ధోరణిని ప్రతిబింబిస్తోంది. ఈ మార్పు యువతకు ప్రేరణగా నిలవచ్చని భావిస్తున్నారు.
హిమాన్ష్ రావు పోస్ట్ ను కింద క్లిక్ చేసి చూడొచ్చ