Akhanda 2: బాలయ్య బాబు హీరోగా వస్తున్న ‘అఖండ 2’ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దానిమీద సందిగ్ధ పరిస్థితిలో ఉన్న సినిమా యూనిట్ ఇంకా అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇక ఇలాంటి సందర్భంలోనే డిసెంబర్ 12వ తేదీన కొన్ని చిన్న సినిమాలైతే రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా డిసెంబర్ 12న రోషన్ కనకాల హీరోగా చేస్తున్న ‘మోగ్లీ’ సినిమా సైతం రిలీజ్ అవ్వనుంది…ఒకవేళ అఖండ మూవీ ఈనెల 12 న రిలీజ్ అయితే ఈ చిన్న సినిమాలన్నీ పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదే విషయం మీద యూట్యూబ్ స్టార్ యాక్టర్ డైరెక్టర్ అయిన బండి సరోజ్ కుమార్ ఒక పోస్ట్ చేశాడు…
ప్రస్తుతం బండి సరోజ్ కుమార్ ‘మోగ్లీ’ సినిమాలో విలన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఆయన ‘అఖండ 2’ సినిమా ప్రొడ్యూసర్లను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టాడు. సినిమా పట్ల బాధ్యత ఉండక్కర్లేదా అంటూ మీరు మీ సినిమా రిలీజ్ పట్ల ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి…
దాన్ని బట్టి చిన్న సినిమాలు ఎప్పుడూ రిలీజ్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకుంటారు. మీరు సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తే మాత్రం అది అందరికి ఇబ్బంది కలిగించవచ్చు. ఇక అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అయినందుకు ఇప్పటికే అభిమానులు చాలా వరకు నిరాశ చెందుతున్నారు. కాబట్టి కొత్త రిలీజ్ ఎప్పుడో చెప్పండి అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది…
ఒక అఖండ ప్రొడ్యూసర్స్ సైతం వీలైనంత తొందరగా ‘అఖండ 2’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది… బండి సరోజ్ కుమార్ మోగ్లీ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్లో తన నటన కూడా చాలా హైలెట్ అవబోతున్నట్టుగా చూపించారు. మొత్తానికైతే డిసెంబర్ 12న ఈ సినిమా అత్యంత వైభవంగా రిలీజ్ కి సిద్ధమవుతోంది…
Most irresponsible behaviour from @14ReelsPlus
ఏదోకటి కన్ఫర్మ్ చేస్తే, 12కి రిలీజ్ అవ్వాల్సిన సినిమాల పబ్లిసిటీ ఖర్చులు మిగులుతాయి కదా. ఏ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా అటు అభిమానుల్ని, ఇటు సినిమా ఇండస్ట్రీ నీ, మరో పక్క డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నీ అందరికీ నిద్రలు లేకుండా చేసి ఏం…— Saroj (@publicstar_bsk) December 8, 2025