KTR – Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో జరుగుతున్న ఉప ఎన్నిక సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. నేతల మధ్య మాటలు దాటిపోయాయి. విమర్శలు, ప్రతి విమర్శలు అంతకుమించి అనే స్థాయిలో వినిపించాయి.. ప్రచారం చివరి రోజు ముఖ్యమంత్రి మీట్ దీ ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నాటి నుంచి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద.. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో వ్యక్తిగతంగా కూడా రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు..
యూసఫ్ గూడ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ చేసిన ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి.. “ఎన్నికల హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డి.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని వ్యక్తి.. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తే ఎలా నమ్మాలి. ఆయన కుర్చీని లాగడానికి పక్కనే ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఆ కుర్చీని మీరే మడతపెట్టి.. తర్వాత ఏం చేయాలో తెలుసుగా అంటూ అది చేయండి అని” కేటీఆర్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ చివరి రోజు యూసఫ్ గూడా ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మీకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఖచ్చితంగా ఉపయోగిo ఎన్నికల్లో కారు గుర్తు మీద మీటనొక్కాలి. కారు గుర్తు మీద గుద్ధుడు గుద్దాలి. అప్పుడే ప్రభుత్వానికి సోయి వస్తుంది. మీకు ఇచ్చిన హామీలు అమలు అవుతాయని” కేటీఆర్ అన్నారు. కేటీఆర్ మాట్లాడిన మాటలకు కార్యకర్తల నుంచి విశేషమైన స్పందన లభించింది. అశేషమైన కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ మరింత ఉత్సాహంగా ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని .. ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు..
వాస్తవానికి ఇక్కడ గులాబీ పార్టీ తరఫునుంచి మాగంటి సునీత పోటీ చేస్తున్నప్పటికీ.. కేటీఆర్ ప్రచారం చేస్తున్న తీరు చూస్తే.. ఆయనే పోటీలో ఉన్నారేమో అనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన దగ్గరి నుంచి మొదలు పెడితే ప్రచారం చివరి రోజు వరకు కేటీఆర్ కాలికి బలపం కట్టుకుని తిరిగారు. వినూత్నమైన విధానంలో ప్రచారం చేశారు. ఆటో కార్మికులు, హైడ్రా బాధితులు.. ఇంకా అనేక వర్గాల ప్రజలతో కలిసి ఎన్నికల ప్రచారం సాగించారు కేటీఆర్. ఏ అవకాశాన్ని కూడా వదలకుండా ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు.