KTR: తెలంగాణ ఉద్యమనేత.. బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వారసుడిగా కల్వకుంట్ల తారకరామారావు రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో 2008లో పోటీ చేసి సిరిసిల్ల నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత నుంచి తన సొంతంగా ఇమేజ్ పెంచుకుని ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారచడమే లక్ష్యంగా పనిచేశారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్‌ను దేశంలోనే అగ్రభాగానికి తీసుకెళ్లారు. పలు ఐటీ ఐటీ శ్రమలతోపాటు వివిధ పరిశ్రమలను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. దీంతో యువత, ఐటీ నిపుణులకు కేటీఆర్ అంటే చాలా ఇష్టం. ఇక కేటీఆర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. మంచి అయినా.. చెడు అయినా సోషల్ మీడియా ప్లాట్‌పాం ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. ఇలా నెటిజన్లకూ కేటీఆర్ దగ్గరయ్యారు. లక్షల మంది ఫాటోవర్లు ఉన్నారు. ఇక ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లోనూ కేటీఆర్ యాక్టివ్గా ఉంటారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న కేటీఆర్ తాజాగా తన పాత ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశారు. దీనిని చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు.
20 ఏళ్ల క్రితం అంటూ..
సమాజంలో జరుగుతున్న విషయాలపై ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తూ.. చర్చిస్తుంటారు. అంతేకాకుండా.. అభిమానులకు కూడా రెగ్యూలర్‌గా రిప్లై ఇవ్వడం.. మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. తన వ్యక్తిగత విషయాలను సైతం ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే.. కేటీఆర్.. తన అరుదైన ఫొటోను పంచుకున్నారు. తాజాగా పోస్టు చేసిన పొటో 2002 లో లండన్‌లో తీసుకున్న ఫొటో అని తెలిపారు. దానితోపాటు 2022లో దిగిన ఫొటోను కూడా పోస్టు చేశారు. 2002లో లండన్‌లోని ఓ టెలిఫోన్ బూత్‌లో నిల్చున పొటో.. 2022లో ఓ టెలిఫోన్ బూత్‌లో నిల్చున ఫొటోను పోస్టు చేశారు. 20 ఏళ్ల క్రితం ఇలా.. ఇప్పుడు ఇలా అని క్యాప్షన్ పెట్టారు. 2002 నాటి ఫొటోలో నూనూగు మీసాలతో బ్లేజర్ వేసుకుని ఫార్మల్‌గా కనిపిస్తున్నారు. ఈ ఫొటోను బట్టి చూస్తే.. ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలోనిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
నెట్టింట్లో వైరల్..
ఇంకేముంది.. కేటీఆర్ ఫొటో షేర్ చేసిన నాటినుంచి నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. కేటీఆర్.. తెలంగాణ ఉద్యమం కంటే ముందు అమెరికాలోనే ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత తెలంగాణకు వచ్చి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
పదునైన మాటలు..
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. తన పదునైన మాటలతో ప్రత్యర్థుల మాటలకు చెక్ పెట్టే మంచి వాగ్దాటి కేటీఆర్ సొంతం. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని.. అధికారం వరకు.. అధికారం నుంచి ప్రతిపక్షం వరకు.. ప్రాంతం ఏదైనా.. ఏ వేదికైనా అనర్గళంగా మాట్లాడుతారు. మాస్ అండ్ డైనమిక్ లీడర్‌గా పేరు పేరుతెచ్చుకున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More