Homeటాప్ స్టోరీస్KTR: కెసిఆర్, శోభమ్మ మధ్యలో నలిగిపోయిన కేటీఆర్.. ఇన్నాళ్లకు తన బాధ చెప్పుకున్నాడుగా

KTR: కెసిఆర్, శోభమ్మ మధ్యలో నలిగిపోయిన కేటీఆర్.. ఇన్నాళ్లకు తన బాధ చెప్పుకున్నాడుగా

KTR: ఇప్పుడున్న జనరేషనే కాదు.. గతంలో ఉన్న జనరేషన్ కూడా ఇబ్బంది పడింది.. ఆ ఇబ్బంది పేరు కెరియర్. ఆ కెరియర్ డిసైడ్ చేసింది తల్లిదండ్రులు. అయితే డాక్టర్ లేదా ఇంజనీర్ ఇంకా ఎక్కువ అవకాశం ఉంటే ఐఏఎస్.. ఇదిగో ఇలానే సాగిపోయేవి తల్లిదండ్రుల కలలు.. ఆశయాలు.. తాము సాధించలేనిది తమ పిల్లలు సాధించాలని తల్లిదండ్రులు ఆరాటపడేవారు. ఏదో ఒక రూపంలో వాటిని పిల్లల మీద బలవంతంగా రుద్దేవారు. మిడిల్ క్లాస్ కంటే ఎబో క్లాస్ లోనే ఈ వ్యవహారం ఎక్కువగా సాగుతూ ఉండేది. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలు మినహాయింపు కాదు. ఆ జాబితాలో కేటీఆర్ కూడా ఉన్నారు. చదువుతుంటే.. ఇది ముమ్మాటికి నిజం.. ఈ విషయాన్ని స్వయంగా ఆయన చెప్పారు.

ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమం లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలను పక్కనపెట్టి తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న విషయాలను ఆయన పంచుకున్నారు. కేటీఆర్ ను డాక్టర్ చేయాలని ఆయన తల్లి శోభమ్మకు బలమైన కోరిక. అందువల్లే డాక్టర్ కోర్స్ వైపు ఆయనను ప్రోత్సహించింది. మరోవైపు కెసిఆర్ ఏమో ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కేటీఆర్ కు సూచించేవారు.. అయితే తల్లి మాటను గట్టిగా పట్టుకున్న కేటీఆర్.. ఇక్కడైతే పని కాదని కర్ణాటకలో కేసెట్ కోసం అప్లై చేశారు. అక్కడ ఎక్సమ్ రాశారు. సెలెక్ట్ అయ్యారు.

ఇదే విషయాన్ని కేసీఆర్ తో చెప్పారు.”డాడీ నాకు కే సెట్ లో ర్యాంకు వచ్చింది. నేను డాక్టర్ కోర్స్ చదవాలి అనుకుంటున్నానని చెప్పారు. దానికి కేసీఆర్ వేరే విధంగా స్పందించారు. నువ్వు డాక్టర్ కోర్స్ గనుక తీసుకుంటే 32 సంవత్సరాలు వచ్చే వరకు చదువుతూనే ఉండాలి. ఎంబిబిఎస్, హౌస్ సర్జన్, ఎండి, సూపర్ స్పెషాలిటీ కోర్స్.. ఆ తర్వాత అర్ధరాత్రి పూట ఎవరు ఫోన్ చేసినా సరే రెస్పాండ్ అవ్వాలి. సుఖమంటూ ఉండదు. సంతోషం అంటూ ఉండదు” అని కెసిఆర్ చెప్పారు. దీంతో కేటీఆర్ తన ఆలోచన ధోరణి మార్చుకున్నారు. మెడిసిన్ లో కాకుండా.. పీజీలో మైక్రో బయాలజీ చదివారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి అక్కడ ఒక సంస్థలో పనిచేశారు.. కేటీఆర్ చెప్పిన మాటలు ఆలోచింపజేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ కోరికలను పిల్లల మీద బలవంతంగా రుద్దితే అవి ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తాయో కేటీఆర్ చెప్పిన మాటల ద్వారా తెలుస్తోంది. పిల్లలకు నచ్చిన చదువు చదివించి.. వారికి నచ్చిన రూట్లో వెళ్లే విధంగా ప్రోత్సహిస్తే బాగుంటుందని కేటీఆర్ పరోక్షంగా చెప్పారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version