Site icon OkTelugu

Tamil Nadu BJP Failure Reasons: అన్నా మలై ని పక్కన పెట్టినా.. ఏఐడీఎంకే చెప్పినట్టు తల ఊపినా.. బిజెపికి ఎందుకీ దుస్థితి

Tamil Nadu BJP Failure Reasons

Tamil Nadu BJP Failure Reasons

Tamil Nadu BJP Failure Reasons: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ని పక్కన పెట్టింది. ఏఐడీఎంకే చెప్పినట్టుగా సీట్లకు ఒప్పుకొంది. అన్ని విధాలుగా.. అన్ని అంశాలలో రాజీ పడింది. వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ.. బిజెపికి తమిళనాడులో ఏమి చేయలేని పరిస్థితి. అందువల్లే ఏఐడీఎంకే ఆడించినట్టు ఆడింది. ఇంత చేసినప్పటికీ ఏమైనా ఉపయోగం ఉందా అంటే.. అది పలుచూపుమేరలో కూడా కనిపించడం లేదు.

ఎగ్జిట్ పోల్స్ లో ఏ సంస్థ కూడా ఏఐటీఎంకే అధికారాన్ని దక్కించుకుంటుందని ప్రకటించలేదు.. పీపుల్ పల్స్ నుంచి మొదలు పెడితే చాణక్య స్ట్రాటజీస్ వరకు ప్రతి సంస్థ కూడా తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. ఇక్కడ ద్రావిడ సెంటిమెంట్ ముందు జాతీయవాదం పనిచేయదని నిరూపించాయి. తమిళనాడు రాష్ట్రంలో 180 ప్లస్ సీట్లతో డిఎంకె కూటమి విజయం సాధిస్తుందని స్మార్ట్ పోల్ సంస్థ ప్రకటించింది. ఇందులో ఏ ఐ డి ఎం కే కూటమికి కేవలం 28 సీట్లు మాత్రమే వస్తాయని ప్రకటించింది. ఓటు షేర్ విషయంలో కూడా కేవలం 27.6 చేత మాత్రమే లభిస్తుందని స్పష్టం చేసింది. మాట్రిజ్ సంస్థ భిన్నమైన ఫలితాన్ని చెప్పినప్పటికీ.. ఈ సంస్థకు అంత గొప్పగా క్రెడిబుల్టి లేదు. ఈ సంస్థ ఏఐడీఎంకే కూటమికి 87 నుంచి 110 సీట్లు వస్తాయని ప్రకటించింది.

యాక్సిస్ మై ఇండియా సంస్థ ఏఐడీఎం కే కూటమికి 22 నుంచి 32 స్థానాలకు వస్తాయని వెల్లడించింది.. చాణక్య స్ట్రాటజీస్ కూడా ఏఐడీఎంకేకు తమిళనాడులో అధికారం రాదని స్పష్టం చేసింది. ఈ కూటమికి కేవలం 50 నుంచి 65 స్థానాలు మాత్రమే వస్తాయని వెల్లడించింది. వాస్తవానికి బిజెపి అధినాయకత్వం తమిళనాడు విషయంలో అంతగా చొరవ చూపలేదని తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రముఖంగా ప్రచారం చేశారు. అక్కడి ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ అదే దూకుడు తమిళనాడులో కొనసాగించలేకపోయారు. పైగా బిజెపి రాష్ట్ర నేతలు ఇక్కడ తలా ఒక దిక్కుగా మారిపోయారు.

అన్నామలై మాటకు విలువ లేకపోవడంతో ఆయన ఎన్నికల్లో టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించారు. కొత్త అధ్యక్షుడు లేకి వ్యాఖ్యలు చేసి.. తమిళ హీరో విజయ్ కి క్షమాపణలు చెప్పారు. ఇక ఏఐడీఎంకే నేతలు కూడా ఇష్టానుసారంగా సీట్ల కేటాయింపు జరిపారు. అత్యంత కఠినమైన సీట్లను బిజెపికి ఇచ్చారు. ఈ విషయాన్ని బిజెపి అధినాయకత్వంతో స్థానిక నాయకులు చెప్పినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఫలితంగా తమిళనాడు ఎన్నికల్లో ఏఐడీఎం కే కూటమి మరోసారి విఫల బృందంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

Exit mobile version