Konda Susmita: తెలంగాణ రాజకీయాలు క్రమక్రమంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు అధికార కాంగ్రెస్ పార్టీలో ఒకరకమైన ప్రకంపనలు మొదలయ్యాయి. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ప్రైవేట్ ఓ ఎస్ డీ సుమంత్ వ్యవహారం వల్ల ఒక్కసారిగా రాజకీయాలు సంచలన విషయాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఇవి ఎక్కడ దాకా వెళ్తాయో తెలియదు కానీ.. ఇప్పటికైతే పరిస్థితి బాగోలేదు. చివరికి పార్టీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కలగజేసుకున్నప్పటికీ కూడా పరిస్థితులు మారడం లేదు.
కొండా సురేఖ వ్యవహారంలో ఆమె కూతురు కొండా సుస్మిత మాట్లాడిన మాటలు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి. కొండా సురేఖ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకమార్లు దూషించారని సుస్మిత ఆరోపించింది. రేవంత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఇంకా అనేకమంది రెడ్లు కలిసి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని.. అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని.. వారు తమ తల్లి రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నారని సుస్మిత ఆరోపించింది. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు సురేఖను దూషించారని.. తట్టుకోలేక ఆమె ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుందని సుస్మిత గుర్తు చేసింది.
ఏం జరగనుంది
సుస్మిత ఆరోపణలు చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొండా సురేఖ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖ ఇంటి ఎదురుగా పోలీసు పోస్టును తొలగించింది. భద్రతను కూడా తగ్గించింది. అంతకంటే ముందు సురేఖ పర్యవేక్షిస్తున్న దేవాదాయ శాఖలో కూడా మార్పులు తీసుకొచ్చింది. మేడారం పనులను పర్యవేక్షించే బాధ్యత ఆర్ అండ్ బి శాఖకు అప్పగించింది. కేవలం సూపర్ విజన్ బాధ్యతలు మాత్రమే దేవాదాయ శాఖకు అప్పగించింది. దీంతో కొండా సురేఖ తీవ్ర నిరాశలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని.. ఈ వివాదాన్ని తగ్గించడానికి కొండా మురళి ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుస్మిత చేసిన వ్యాఖ్యల సంబంధించిన వీడియోను గులాబీ మీడియా విపరీతంగా సర్కులేట్ చేస్తోంది.
మీడియా ముందుకు వెళ్లొద్దు
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వ్యవహరించాల్సిన తీరుపై తెలంగాణ ప్రభుత్వం సమావేశమైంది. మంత్రివర్గ భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మనసులో ఉన్న మాటలను వారితో చెబుతున్నారు. ప్రస్తుతం సచివాలయంలో ఈ భేటీ కొనసాగుతోంది. అయితే ఈ భేటీకి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి విక్రమార్కును కలిశారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయారు.. మరోవైపు కొండ సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. విలేకరుల ఎదుటకు వెళ్లి మాట్లాడకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
రేవంత్ రెడ్డి మా అమ్మను చాలా సార్లు నోటికి ఇష్టమొచ్చినట్లు అసహనంగా మాట్లాడేవాడు.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము ప్రశాంతంగా ఉన్నాం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మీదే కుట్రలు చేస్తున్నారు
రేవంత్ రెడ్డి ఒకడు, పొంగులేటి ఒకడు, వేం… https://t.co/3lGUrZrDd0 pic.twitter.com/aoOxErtqUc
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2025