Homeటాప్ స్టోరీస్Himanshu Birthday: మనవడు హిమాన్షు బర్త్ డేను కేసీఆర్ ఏ రేంజ్ లో చేశాడో చూశారా..

Himanshu Birthday: మనవడు హిమాన్షు బర్త్ డేను కేసీఆర్ ఏ రేంజ్ లో చేశాడో చూశారా..

Himanshu Birthday: అత్యంత భారీ కేక్.. దానికి అనుబంధంగా మిగతా కేక్ లు.. ఒక్కొక్కటి ఒక ఫ్లేవర్.. ఆ సెటప్ మామూలుగా లేదు.. బంధువులు.. దగ్గరి వాళ్ళు.. రావడంతో ఆ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది. ఇంతలోనే సడన్గా కెసిఆర్ ఎంట్రీ ఇచ్చారు.. ఆయన వెంట కేటీఆర్ కూడా ఉన్నారు.. ఇదంతా కూడా కెసిఆర్ నివాసంలో జరిగింది.

కెసిఆర్ మనవడు హిమాన్షు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిమాన్షు తన జన్మదిన వేడుకలను వ్యవసాయ క్షేత్రంలో.. తాత సమక్షంలో జరుపుకునేవారు. వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు కూడా నాటేవారు. కెసిఆర్ స్వయంగా హిమాన్షుతో మొక్క నాటించేవారు. ఇటీవల హిమాన్షు స్పోర్ట్స్ ఆడుతుండగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనను కుటుంబ సభ్యులు ఏఐజి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందిన హిమాన్షు కోలుకున్నాడు.

హిమాన్షు తన జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నాడు. తండ్రి కేటీఆర్.. తల్లి శైలిమ.. సోదరి అలేఖ్య.. నానమ్మ శోభమ్మ.. తాతయ్య కేసీఆర్ సమక్షంలో జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నాడు. అత్యంత భారీ కేక్ కట్ చేసి తాతయ్యకు తినిపించాడు. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాడు. తన సోదరుడి కోసం అలేఖ్య అద్భుతమైన కేక్ రూపొందించింది. దానిని తన తండ్రి కేటీఆర్ కు చూపిస్తే ఆయన ఆశ్చర్యపోయారు..

తన పుట్టినరోజుకు సంబంధించిన దృశ్యాలను వీడియో రూపంలో రూపొందించిన హిమాన్షు.. దానిని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసాడు. దీంతో అతడికి గులాబీ పార్టీ నాయకులు.. ఇతరులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా హిమాన్షు ప్రస్తుతం 21 సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. అతడు ఉన్నత విద్యను అమెరికాలో అభ్యసిస్తున్నాడు. దానికంటే ముందు హైదరాబాదులోని ఓక్రిడ్జ్ స్కూల్లో చదువుకున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version