HomeతెలంగాణTelangana Congress : టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది... ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కేసీ.వేణుగోపాల్‌ రహస్య భేటీ..?

Telangana Congress : టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది… ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కేసీ.వేణుగోపాల్‌ రహస్య భేటీ..?

Telangana Congress :  తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల పది మంది ఎమ్మెల్యేలు రసహ్యంగా భేటీ అయ్యారు. ఇది పార్టీలో సంచలనం రేపింది. వారం రోజులుగా దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి సీఎలీ‍్ప సమావేశంలో చెక్‌ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న తీరు కూడా హస్తం పార్టీకి తలనొపి‍్పగా మారింది. దీనిపైనా టీపీససీ సీరియస్‌గా స్పందించింది. ఇలాంటి తరుణంలో ఢిలీ‍్లలోనూ ఓ రహస్య భేటీ జరిగినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణతోపాటు టీపీసీసీ పదవల భర్తీ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడి‍్డ, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఫిబ్రవరి 6న ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. తెలంగాణలో కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై వివరించారు. తర్వాత కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి ఇటీల జరిగిన ఎమ్మెల్యే రహస్య భేటీ, ఎమ్మెల్సీ తీనా‍్మర్‌ మల్లన్న వ్యవహారం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఉత్తమ్‌తో భేటీ..
ఇదిలా ఉంటే.. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ ఢిల్లీలో ఉండగానే కేసీ.వేణుగోపాల్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి పాలన, ప్రజల్లో పారీ‍్టపై పెరుగుతున్న వ్యతిరేకత, పథకాల అమలు తీరు, సీఎం వైఫల్యాలపై చర్చించారని సమాచారం. ఇప్పుడు ఈ భేటీ విషయం బయటకు రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే ఉత్తమ్‌ సీఎం పదవి కోసం ప్రయత్నించారు. అయితే అధిష్టానం రేవంత్‌రెడ్డివైపే మొగ్గు చూపింది. అయితే కాంగ్రెస్‌ వీర విదేయుడు అయిన ఉత్తమ్‌ ద్వారా రేవంత్‌రెడ్డి పనితీరుపై తరచూ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా కేసీ.వేణుగోపాల్‌ రహస్య భేటీ జరిపనట్లు తెలిసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular