Kavitha sensational comments: బీఆర్‌ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావు తనయ, పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. వీలు చిక్కినప్పుడల్లా బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె మాజీ మంత్రి హరీశ్‌రావుని టార్గెట్ చేశారు. పార్టీలో అంతర్గత కలహాలక హరీశ్ కారణమని ప్రకటించారు. అయితే ఇటీవల హరీశ్‌రావు మరణించిన తర్వాత కవిత వెళ్లి పరామర్శించారు. అయితే తాజాగా మరోమారు హరీశ్‌రావు టార్గెట్‌గా మరో బాంబు పేల్చారు. మోసం చెయ్యడం హరీశ్‌రావు నైజం అంటూ కవిత చేసిన వాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
ఓటమి భయంతో తప్పించుకున్నారు..
మెదక్‌లో మీడియాతో మాట్లాడిన కవిత.. ప్రధానంగా హరీశ్ రావు ప్రవర్తన, ఓటమి తర్వాత బాధ్యత నుంచి తప్పించుకోవడంపై దృష్టి పెట్టారని విమర్శించారు. పార్టీ లోపల తాను మాట్లాడితే తప్పించారని, కానీ బయటకు వచ్చి నిజం చెప్పడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నాయకులు సామాజిక మాధ్యమాల్లో మాత్రమే సజీవంగా ఉన్నారనీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు దూరమవడం వల్లే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సర్ర్‌పైజ్ ఓటమి ఎదురైందని తెలిపారు. కేటీఆర్ సోషల్ మీడియా మూసి ప్రజల మధ్యకు రావాలని సూచించారు.
బినామీల బలోపేతం..
హరీశ్ రావు బినామీలు ప్రభుత్వ ప్రాజెక్టులలో భాగస్వామ్యమై ఉన్నారని, వారి కంపెనీలు సీఎం కార్యాలయానికి నేరుగా అనుబంధంగా ఉన్నాయని ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాలోనేగానీ, నేలమీద కనబడట్లేదు అని పేర్కొన్నారు. ఉద్యమ నాయకత్వం నుంచి వాణిజ్య రాజకీయాలకు మారిన బీఆర్‌ఎస్ నేతల విమర్శ. సీఎం సన్నిహితులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మదన్ రెడ్డిల ఆస్తుల పెరుగుదలపై ఆమె ప్రశ్నలు సంచలనం సృష్టించాయి. పార్టీ కేడర్ పది సంవత్సరాలుగా శ్రమించినా, ఫలితం నేతలకే దక్కిందని వ్యాఖ్యానించారు.
హరీశ్ – పద్మ స్నేహంపై..
పద్మా దేవేందర్‌రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పాత గాయాలను మళ్లీ తెరిచాయి. కేసీఆర్‌పై విమర్శలతో పార్టీ వదిలిన పద్మ, తర్వాత తిరిగి చేరడాన్ని గుర్తుచేస్తూ, ఆమెపై నాలో అవిశ్వాసం ఉన్నప్పుడు, హరీశ్ రావు ఎలా మద్దతునిస్తారు? అని ప్రశ్నించి పైకి మౌనంగా ఉన్న విభేదాలకు మరింత జీవం పోశారు.
కవిత వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ నాయకత్వంపై వ్యక్తిగత అసంతృప్తికి మాత్రమే కాదు, పార్టీ పునర్వ్యవస్థీకరణ దిశలో ఉన్న అస్పష్టతకూ సంకేతం. ఆమె విమర్శలు తెలంగాణలో మాజీ సహచరులకు తలనొప్పిగా మారుతున్నాయి.