Kavitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ట్వీట్ చేశారు. కర్మ వెంటాడిందని ఆ ట్వీట్ లో ఆమె పేర్కొన్నారు. తద్వారా జూబ్లీహిల్స్ ఓటమి గులాబీ పార్టీకి సరైన గుణపాఠం చెప్పిందని ఒక ముక్కలో తేల్చి పడేశారు.
జూబ్లీహిల్స్ ఓటమి బాధలో ఉన్న గులాబీ పార్టీని కల్వకుంట్ల కవిత శనివారం మరింత ఇబ్బంది పెట్టారు.. ప్రస్తుతం ఆమె ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు.. ఈ సందర్భంగా కవిత విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వాస్తవానికి పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత ప్రధానంగా హరీష్ రావును లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ కల్వకుంట్ల కవిత ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని ఆమె పకడ్బందీ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
స్వయంగా కుటుంబ సభ్యురాలు కావడంతో ఆమెకు అన్ని విషయాల మీద పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. అందువల్లే ఆమె పాఠం చెప్పినట్టుగా విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావుకు 450 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని.. త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ఆయన కోసమే మార్చారని.. ఇలా రకరకాలుగా ఆరోపణలు చేశారు కల్వకుంట్ల కవిత. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెడ్డిపల్లి, చిప్పలదుర్తి, తుంకి గ్రామాలలో దాదాపు 450 ఎకరాలను హరీష్ రావు కొనుగోలు చేశారని.. వాటిని తన వ్యవసాయ క్షేత్రంగా మార్చారని కవిత ఆరోపించారు. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఒక రిసార్ట్ కూడా ఉందని కవిత ఆరోపించారు. అందులోకి ఎవరనీ అనుమతించరని కవిత ఆరోపించారు.
“ఇటీవల హరీష్ రావు తండ్రి చనిపోయారు. అప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. బీఆర్ఎస్ ప్రచారం మొదలుపెట్టింది. తండ్రి చనిపోయాడు కాబట్టి హరీష్ రావు ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన జూబ్లీహిల్స్ ప్రచారాన్ని చేస్తున్నట్టు అనుచరులు సోషల్ మీడియాలో డబ్బా కొట్టారు. చివరికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత హరీష్ రావు ఉండి ఉంటే బాగుండేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. కేటీఆర్ సోషల్ మీడియాని వదిలిపెట్టి బయటికి రావాలి. ట్విట్టర్ కు దూరంగా ఉండాలి.. కేటీఆర్, హరీష్ రావు కృష్ణార్జునులు ఉంటారు.. ఒకళ్ళ మీద ఒకరు బాణాలు వేసుకుంటే కార్యకర్తలు ఆగమవుతారు కదా” అని కవిత ఆరోపించారు..
మెదక్ జిల్లాలో విద్య వ్యవస్థ దయనీయ పరిస్థితుల్లో ఉంది. మహా నాయకులు ఉన్న ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఉంటది అని ఎవరు ఊహించరు – జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత#JagruthiJanamBaata #KavithaKalvakuntla pic.twitter.com/35Q72PLEca
— Telangana Jagruthi (@TJagruthi) November 15, 2025