Shiva Re Release First Day Collections: ‘అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కెరీర్ లో కల్ట్ క్లాసిక్ చిత్రం గా పిలవబడే ‘శివ'(#Shiva4k) చిత్రాన్ని సరికొత్త టెక్నాలజీ కి మార్చి నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ రీలీజ్ చేయగా, అక్కినేని ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్, కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇది కదా నాగార్జున విశ్వరూపం అంటే, మంచి సినిమాలు ఈమధ్య కాలంలో రాకపోవడం తో నాగార్జున స్టామినా తెలియలేదు కానీ, ఆయన ఒక్కసారి ఫార్మ్ లోకి వస్తే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి అంటూ సోషల్ మీడియా లో నాగార్జున అభిమానులు అంటున్నారు. కేవలం యూత్ ఆడియన్స్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి క్యూలు కడుతున్నారు. నిన్న ఈ చిత్రం తో పాటు రెండు కొత్త సినిమాలు కూడా విడుదలయ్యాయి. కానీ ఆడియన్స్ శివ చిత్రానికే ఎక్కువ మొగ్గు చూపించారు.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 2 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. కేవలం మొదటి రోజు మాత్రమే కాదు, రెండవ రోజు కూడా ఈ చిత్రానికి కోటిన్నర కి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొదటి రోజు బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 18 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రెండవ రోజున ఇప్పటి వరకు ఈ చిత్రానికి 13 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. సాధారణంగా రీ రిలీజ్ చిత్రాలకు హైదరాబాద్ లో మాత్రమే నాలుగైదు రోజుల లాంగ్ రన్ వస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి రోజు తప్ప, మిగిలిన రోజుల్లో వసూళ్లు వచ్చే అవకాశాలే లేవు. అలాంటిది ఈ చిత్రానికి రెండవ రోజు కూడా ఆంధ్ర ప్రదేశ్ లో డీసెంట్ స్థాయి వసూళ్లు రావడం గమనార్హం.
రేపు కూడా ఆదివారం కావడం తో కచ్చితంగా ఈ చిత్రానికి మరో కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సీనియర్ హీరోలలో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పే దిశగా ఈ చిత్రం ముందుకు వెళ్తోంది. గత కొంత కాలంగా హీరో గా సరైన సక్సెస్ ని అందుకోలేకపోతున్న నాగార్జున, శివ రీ రిలీజ్ తో మరోసారి ఆడియన్స్ కి తన పవర్ ఏంటో చూపించాడు. అక్కినేని ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం ఒక్క ఓవర్సీస్ నుండే ఈ చిత్రం ఫుల్ రన్ లో లక్ష డాలర్ల గ్రాస్ ని రాబట్టేలాగా ఉంది.