Kavitha Protest Plan: కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీలో ఏం జరిగింది. ఏ విషయాలపై ప్రధానంగా చర్చ జరిగింది అనే విషయంలో ఆసక్తికరమైన వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మిగతా విషయాలపై ఏం చర్చ జరిగినా, ప్రధానంగా జాగృతి అధ్యక్షురాలు, తన చెల్లెలు కవితపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కు కేటీఆర్ అడిగారని, ఆ విషయంపై కేసీఆర్ ససేమిరా అనడంతో తండ్రి, కొడుకు మధ్య అభిప్రాయ బేధం నెలకొందని మీడియా కథనాలు రావడంతో తెరవెనుక ఏం జరుతుందని ఆసక్తికరమైన చర్చ ఊపందుకుంది. అది ఏ పరిస్తితులకు దారి తీస్తుందో అని పార్టీలో గందరగోళం ఆవరించింది.
బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ స్టాండ్, స్థానిక సంస్థల ఎన్నికలకు ఏవిధంగా సంసిద్ధం కావాలి అనే విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే బీసీలకు 42 రిజర్వేషన్ సాధించే దిశగా
కవిత 72 గంటల పాటు దీక్ష చేస్తానని ప్రకటించడంపై కూడా చర్చిస్తూ, పార్టీ నిర్ణయాల కన్నా ముందే కవిత దూకుడు ప్రదర్శించడంపై కేటీఆర్ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Also Read: ఫామ్ హౌస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మంత్రాంగం.. ఏంటి కథ?
కొరకరాని కొయ్యగా కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కొరకరాని కొయ్యగా మారిందని, ఆమె దూకుడుకు కళ్ళెం వేయకుంటే పార్టీలో గందరగోళం చోటు చేసుకుంటుందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్, కేసీఆర్ కు సూచించగా, ఆ విషయం తనకు వదిలివేయండి. మిగతా విషయాలు చూసుకోవాలని కేసీఆర్ చెప్పినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. అయితే కేసీఆర్ తన కూతురైన కవితను ఎందుకు వెనకవేసుకు వస్తున్నాడు, దీని వెనుక ఏదైనా వ్యూహరచన జరుగుతోందా అనే కోణంలో చర్చ జరుగుతోంది. కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చేనాటికి ముందునుంచే కవిత, కేసీఆర్ కు కూతురుగానే కాకుండా రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో ఏ నిర్ణయమైనా, కవితకు తెలియకుండా జరగలేదని, పార్టీ టిక్కెట్లు ఇచ్చే విషయంలో కూడా కవిత చొరవ చూపడం, తన టీమ్ తో ఆశావహులపై సమాచారం తెప్పించుకొని, అభ్యర్థుల ఎంపికల్లో ప్రధాన భూమిక నిర్వహించేవారు. అలాంటి పరిస్థితి నుంచి తనను పార్టీలో ప్రాముఖ్యత తగ్గించేలా వ్యవహరించడంపై ఆమె కినుక వహించింది.
Also Read:కొత్త రేషన్ కార్డులకు టైం ఫిక్స్.. ఎప్పుడు ఇస్తారంటే?
కానీ కేసీఆర్ మాత్రమే తమ నాయకుడని, మిగతా వారెవరు తనకు లెక్కలోకి రారని అర్థమయ్యే రీతిలో మీడియాలో బహిరంగంగానే ఆమె మాట్లాడడం, కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె కామెంట్ చేయడం, ఆ విషయంలో పార్టీ ఆమెను ప్రశ్నించే ధైర్యం చేయలేకపోవడానికి కారణం కేసీఆర్ ఆమెకు అండగా ఉన్నారని చర్చ జరిగింది. గతంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనే, సూచనలు, ప్రతిపాదనలను కూడా కేసీఆర్ ఒక మాటతో చర్చకు తెరదించారు. ఈ విషయంలో కూడా కవిత సూచన మేరకే కేసీఆర్ ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కేసీఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయం వెనుక కవిత ప్రమేయం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే కవిత స్వయం ప్రకటిత నిర్ణయాలు చేస్తుందా లేక కేసీఆర్ ఆమె వెనుక ఉండి నడిపిస్తున్నారా అనే అనుమానాలు పార్టీలో వ్యక్తమౌతున్నాయి.