Jagadish Reddy Comments: మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ సభ్యుడు జగదీశ్ రెడ్డి ఆగడం లేదు. ఇటీవల ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో జగదీష్ రెడ్డి జాగృతి అధినేత్రి పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు గులాబీ బాస్ కుమార్తెను ఇబ్బందికి గురి చేశాయి. దీంతో ఆమె లిల్లీపుట్ నాయకుడు అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డి కూడా జాగృతి అధినేత్రికి అదే స్థాయిలో సమాధానం చెప్పారు. వీరిద్దరి మధ్య జరిగిన వాదాలు, సంవాదాలకు సంబంధించి మీడియాలో పెద్ద పెట్టున చర్చ జరిగింది. జాగృతి నాయకులు జగదీష్ రెడ్డిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం చేశారు. ఇటీవల ఈ వ్యవహారం కాస్త సైలెంట్ అయిపోయింది.
Also Read: కవితకు ఇప్పటికిప్పుడు సొంత మీడియా, సోషల్ మీడియా చాలా అవసరం!
జగదీష్ రెడ్డి ని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆయనకు ప్రధానంగా జాగృతి అధినేత్రికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు జగదీష్ రెడ్డి ఏమాత్రం తడుముకోకుండా.. తడబాటుకు గురికాకుండా సమాధానం చెప్పారు..” భారత రాష్ట్ర సమితికి కవితతో ఎటువంటి సమస్య లేదు. ఆమెను పార్టీ నుంచి తొలగించలేదు. బొగ్గు గనుల అనుబంధ సంఘం అధ్యక్షులను మార్చడం కొత్తకాదు. జాగృతి కూడా కొత్తది కాదు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. ఏ దేశంలో సొంత పార్టీ పెట్టుకునే అవకాశం ఎవరికైనా ఉంది. కవిత ది మాత్రమే కాదు, ఆమె భర్త ఫోన్ కాల్స్ కూడా వినలేదు. ఆ ప్రచారం మొత్తం పూర్తి నిరాధారమైనదని” జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read: కేటీఆర్ స్కెచ్.. కవిత నుంచి చేజారిన సింగరేణి.. జాగృతి అధినేత్రి ఏం చేస్తారు?
ఇటీవల అమెరికా వెళ్లిన తర్వాత జాగృతి అధినేత్రి ఒక లేఖ రాశారు. తనపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోంది అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. బొగ్గు గనులకు సంబంధించి అనుబంధ సంఘం గౌరవ అధ్యక్షురాలిగా తనను తొలగించడం పట్ల ఆమె పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనక ఒక కీలక నాయకుడు ఉన్నారని.. అతడు తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కవిత పరోక్షంగా వ్యాఖ్యానించారు. కవిత లేఖ రాసిన తర్వాత గులాబీ పార్టీ నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. అయితే ఇప్పుడు జగదీష్ రెడ్డి ఓపెన్ అయిపోయారు. గౌరవ అధ్యక్షులను మార్చడం కొత్త కాదని స్పష్టం చేశారు. దీనిని బట్టి కల్వకుంట్ల కవితకు పార్టీలో ఎటువంటి సముచిత స్థానం లేదని.. ఆమె పార్టీలో ఒక కార్యకర్త అని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. గులాబీ బాస్ ఆదేశాలు లేకుండా.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి సూచనలు లేకుండా జగదీష్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాలని పొలిటికల్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.
Cross Fire : నల్గొండ జిల్లాలో పార్టీ పరిస్థితికి నాదే బాధ్యత : Jagadish Reddy – TV9#jagadishreddy #brs #rajinikanthvellalacheruvu #crossfire #telanganapolitics #telangana #tv9telugu pic.twitter.com/xf0dkLOyUv
— TV9 Telugu (@TV9Telugu) August 24, 2025