Acne: మొటిమలు, మచ్చలతో బాధ పడుతున్నారా? ఈజీ టిప్..

ఫేస్ మీద పేరుకున్న జిడ్డు వల్ల వల్ల మొటిమలు, మచ్చలు ఏర్పడితే క్రీమ్స్ కు బదులు సహజమైన పద్ధతులు ట్రై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దీనికోసం ఏం చేయాలంటే..

Written By: Swathi, Updated On : April 1, 2024 5:47 pm

Tips-for-Suffering-from-acn

Follow us on

Acne: ఎండాకాలం వచ్చేసింది. ఉడకపోతే, చెమట, జిడ్డు అన్ని ఇబ్బంది పెడుతుంటాయి. జిడ్డు వల్ల మొటిమలు వస్తుంటాయి. అంతేనా మచ్చలు కూడా ఇబ్బంది పెడుతాయి. ఇక వీటిని నివారించడం కోసం ఏకంగా క్రీమ్స్ రాయాలి అనిపిస్తుంది. వాటి కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కూడా తప్పదు. కొన్ని సార్లు డబ్బు ఖర్చు చేసినా కూడా ఫలితం దక్కదు. మరి మచ్చలు, మొటిమలు ఇబ్బంది పెడితే డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు? ఓ సారి వేప నూనెను ట్రై చేయండి.

ఫేస్ మీద పేరుకున్న జిడ్డు వల్ల వల్ల మొటిమలు, మచ్చలు ఏర్పడితే క్రీమ్స్ కు బదులు సహజమైన పద్ధతులు ట్రై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దీనికోసం ఏం చేయాలంటే.. వేపనూనె, ముల్తానీ మట్టి, తులసి పొడిని మిశ్రమంగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత రిజల్ట్ ను మీరే గమనించవచ్చు. వేప నూనెలో అనేకమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.

వేప నూనెలో విటమిన్ ఇ ఎక్కువగా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎన్నో శతాబ్దాలుగా ఈ వేపనూనెను అందానికి ఉపయోగిస్తుంటారు. ముఖం మీద మొటిమలను పోగొడుతుంది. దీనితో పాటు పొడి చర్మం, ముడతలు, దురద, అలర్జీ, చర్మ మచ్చలు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. వేప నూనె చర్మంలో కొల్లాజెన్ ను ఉత్పత్తిని పెంచుతుంది కాబట్టి.. చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

వేప నూనె ఎన్నో రకాల చర్మ సమస్యలను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ వేప నూనెను రాసుకోవడానికి ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో నూనెను తీసుకొని దూది సహాయంతో 2-3 చెంచాల వరకు అప్లై చేసుకోవాలి. వేప నూనె రాసుకొని రాత్రంతా అలాగే వదిలేయండి. ఉదయం లేచి కడుక్కోండి. దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.