Kalvakuntla Kavitha : ఆర్కే పత్రికలో బ్యానర్ స్థాయిలో ఆ వార్తలు ప్రచురితం కావడంతో నిజమే అని చాలామంది అనుకున్నారు. వాస్తవానికి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లారు అనే వార్త నే ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆమె మరో షర్మిల అవుతున్నారని.. కొద్దిరోజులపాటు పార్టీ నడిపిస్తారని.. ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేస్తారని రకరకాల విశ్లేషణలు సాగాయి. సింగరేణి ఏరియాలలో పట్టు కోసం ఆమె ప్రయత్నిస్తున్నారని.. ఏకంగా 11 ఏరియాలలో జాగృతి కన్వీనర్లను నియమించారని.. గతంలో తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా కవిత కొనసాగారని.. నాటి ప్రాభవం కోసం ఆమె తాపత్రయపడుతున్నారని ఆంధ్రజ్యోతిలో కథనాలు వెలువడ్డాయి.. అయితే కొద్ది రోజులుగా భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వస్తున్న వార్తలపై గులాబీ నేతలు సైలెంట్ గా ఉన్నారు. వాస్తవానికి కల్వకుంట్ల కవిత రాసిన లేఖలను మొదట్లో కొంతమంది గులాబీ నేతలు డ్రామా అని కొట్టిపారేశారు. ఆ తర్వాత ఆ లేఖలు రాసింది తనే అని చెప్పడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు..
Also Read : లావా ఉడుకుతోంది.. గులాబీ అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలు కావచ్చు!
ఇక కాంగ్రెస్ తో రాయబారం కథనంలో రేవంత్ రెడ్డి పేరు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరు ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రస్తావించింది. తను పార్టీలో చేరే విషయాన్ని కొంతమంది దూతల ద్వారా కాంగ్రెస్ పెద్దలకు తెలియజేశారని.. ఈ విషయాన్ని వారు రేవంత్, మహేష్ కుమార్ వద్ద ప్రస్తావిస్తే వారు నో చెప్పారని.. ఇలా రకరకాల విశ్లేషణలతో ఆంధ్రజ్యోతి కథనాన్ని వండివార్చింది. అయితే దీనిపై బుధవారం ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చ జరిగింది. సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగానే ఈ వ్యవహారంపై గులాబీ నేతలు ష్ గప్ చుప్ అన్నట్టుగా వ్యవహరించారు. చివరికి ఈ విషయం రాజకీయంగా దుమారం రేపడంతో కవిత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందించాల్సి వచ్చింది..” కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రిక ది జర్నలిజమా?? శాడిజమా?” అంటూ కవిత తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. మొత్తంగా తన కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని.. కొత్త పార్టీ పెట్టేది లేదని విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఆంధ్రజ్యోతి గనక సంప్రదిస్తే
కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నాయని.. కాకపోతే వాటికి చర్చలు సాగుతున్నాయని” కవిత చెప్పాలనుకున్నారా.. లేక మరేదైనా సమాధానాలు చెప్పే వారేమో.
ఆమధ్య ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉందని ముందుగానే చెప్పింది ఆంధ్రజ్యోతి. అప్పట్లో ఆంధ్రజ్యోతిపై ఇదే స్థాయిలో కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ నిర్వహించిన ఇంటర్వ్యూలోను ఆమె అదే స్థాయిలో స్పందించారు. సీన్ కట్ చేస్తే ఆమె జైలుకు వెళ్లారు. ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు.. కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్లిన విధానంపై కూడా అన్నిటికంటే ఆంధ్రజ్యోతి ముందుగా రాసింది. ఇప్పుడు కూడా కవిత తనదైన స్పందనను వ్యక్తం చేసింది. అంటే ఈ లెక్కన దాల్ మే కుచ్ కాలా హై అన్నట్టే కదా..