BRS Party : భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుగుబాటు… రాష్ట్ర రాజకీయాలలో హీట్ ను పెంచింది. ఇది మొత్తం గులాబీ సుప్రీం ఆడిస్తున్న నాటకం అని కొన్ని సెక్షన్లు ప్రచారం చేస్తున్నప్పటికీ.. కొన్ని నాటకీయ పరిణామాలు మాత్రం చకాచకా సాగిపోతున్నాయని తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారంపై మిగతా మీడియా సంస్థలు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. ఆంధ్రజ్యోతి మాత్రం ఈరోజు తన తెలంగాణ ఈ విషయంలో బీభత్సమైన బ్యానర్ వార్త కుమ్మేసింది. వాస్తవానికి ఎటువంటి సమాచారం లేకుండా రాధాకృష్ణ ఇలాంటి వార్త రాయడానికి సాహసించడు. గతంలో కల్వకుంట్ల కవిత పేరు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఉందని ఆంధ్రజ్యోతినే ఫస్ట్ రాసింది. కవిత అరెస్టు తప్పదని స్పష్టం చేసింది. రాధాకృష్ణ రాసినట్టుగానే.. ఆయన వ్యాఖ్యానించినట్టుగానే కవిత అరెస్టు జరిగిపోయింది.
భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కొట్టి పారేసినప్పటికీ.. కొన్ని గులాబీ సెక్షన్లు కాదని చెబుతున్నప్పటికీ.. భారత రాష్ట్ర సమితిలో మాత్రం అంతర్గతంగా ఏదో జరుగుతోంది. గతంలో కల్వకుంట్ల కవిత నాయకత్వం వహించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి పోటీగానే సింగరేణి జాగృతిని ప్రకటించింది. 11 ఏరియాలలో కన్వీనర్లను కూడా నియమించింది. సంప్రదింపులకు వచ్చిన కొంతమంది కేసీఆర్ ముఖ్య అనుచరులతో కూడా కల్వకుంట్ల కవిత తన నిర్ణయాన్ని చెప్పిందని.. పార్టీ పెట్టడం ఖాయమని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన స్థానం పార్టీలో ఏమిటో ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికి కల్వకుంట్ల కవితలో అసంతృప్తి ఇంకా తగ్గలేదు. అందువల్లే ఇలాంటి తిరుగు బావాటా ఎగరవేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే పార్టీపై పెత్తనం సోదరుడి సొంతమైంది. సర్వం ఇవ్వడానికి కేసీఆర్ రెడీ అయిపోయారు. అయితే కెసిఆర్ కు కుమార్తె అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. ఆమె కోరిన కోరికలకు.. ముందు ఉంచుతున్న ప్రతిపాదనలకు లొంగడం లేదని కొన్ని సెక్షన్లు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే సొంతంగా కెరియర్ ఎంచుకోవడానికి కల్వకుంట్ల కవిత ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ పెడితే.. ఆమె నడపగలదా? ఆర్థికంగా పరిపుష్టి ఉన్నప్పటికీ ఆమె నిలబడగలదా? అంతటి కేసీఆరే ఇబ్బంది పడుతున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలను సాధించాడు..
” ఈ జూన్ ఫస్ట్ వీక్ లో బహుజన సామాజిక న్యాయం బహుజనులకు సామాజిక న్యాయమే ఎజెండాగా సొంత పార్టీ ప్రకటిస్తుందట. పాదయాత్ర ప్లాన్ చేస్తుందట. ఆంధ్రజ్యోతి రాసినట్టుగానే కాంగ్రెస్ పార్టీ వెంటనే కవితను తనలో చేర్చుకోదు. కాబట్టి కొద్ది రోజులపాటు ఇండివిజువల్ గా కల్వకుంట్ల కవిత పనిచేయాలి. ఎలాగో ఆమె బిజెపిలోకి వెళ్లే అవకాశం లేదు. పులి ఆ తర్వాత కాంగ్రెస్ లో షర్మిల ఎలాగైతే తన పార్టీని మెర్జ్ చేసిందో.. అలాగే కవిత కూడా పార్టీ పెట్టి కాంగ్రెస్ లోనే కలపాలి” ఇలా సాగుతున్నాయి పొలిటికల్ చర్చలు.
దీని వెనక రిజల్ట్ ఎలా ఉంటుంది.. ఎలాంటి పరిణామాలు జరుగుతాయి.. అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా గులాబీ పార్టీకి నష్టం కలిగించవా? అంటే కల్వకుంట్ల కవిత బయటకి వెళ్లిపోవడం గులాబీ సుప్రీంకో ఒకరకంగా లాభమే..” ఇప్పటిదాకా గులాబీ సుప్రీం మీద కుటుంబ పార్టీ.. కుటుంబ పాలన అనే విమర్శ ఉండేది. ఆయన కుమార్తె వెళ్ళిపోతే.. పార్టీ కోసం సొంత బిడ్డను కూడా గులాబీ సుప్రీం సహించలేదు. వెళ్ళిపోతుంటే అడ్డుకోలేదు.. అనేవాదన ఆయనకు బలమవుతుంది. తన మీద ఉన్న ప్రధాన విమర్శకు సరైన సమాధానం అవుతుంది. పైగా కల్వకుంట్ల కవిత మీద అవినీతి అనే ముద్దుల కూడా ఉంది” అనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..