Kaleshwaram Case : కాళేశ్వరం కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ చేతిలోకి వెళ్ళింది. కేంద్ర దర్యాప్తు సంస్థ చేతిలో కొన్ని వేల కేసులు ఉన్నాయి. ఇప్పటికే జగన్ అక్రమస్తుల కేసు సంవత్సరాలుగా పెండింగ్లోనే ఉంది. ఆయన కూడా బెయిల్ మీదనే ఉన్నారు. వివేక హత్య కేసు కూడా ఇంతవరకు తేలలేదు. ఇవే కాదు ఇంకా చాలా కేసుల్లో కూడా సిబిఐ అడుగులు అంత వేగంగా లేవు. సిబ్బంది కొరత కూడా కేంద్ర దర్యాప్తు సంస్థను తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమయంలో కాళేశ్వరం కేసు సిబిఐ చేతిలోకి వెళ్ళింది.. ఈ కేసు ఇప్పుడు తేలుతుందా? ఇప్పటికిప్పుడు శిక్ష పడుతుందా? అనే ప్రశ్నలు పక్కన పెడితే.. తెలంగాణ ముఖ్యమంత్రిని గులాబీ పార్టీ తక్కువ అంచనా వేసింది. ఇప్పటికీ కూడా రేవంత్ తమను ఏమీ చేయలేరనే ధీమాలోనే గులాబీ పార్టీ ఉంది.
తన భవిష్యత్తు అక్కడే నిర్మించుకున్నాడు
వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి తన రాజకీయ భవిష్యత్తును మొత్తం తమ పార్టీ మీదనే నిర్మించుకున్నాడనే విషయాన్ని గులాబి నేతలు విస్మరిస్తున్నారు.. పింకు పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవహరించిన తీరు వల్లే ఆయన ఒక్కసారి గా తెలంగాణలో హీరో అయిపోయాడు. కెసిఆర్ కు ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదిగాడు.. కాంగ్రెసులో గొప్ప గొప్ప నాయకులు ఉన్నప్పటికీ కొడంగల్ శాసనసభ్యుడిని అధిష్టానం ముఖ్యమంత్రి ని చేయాలని భావించిందంటే.. అతని స్టామినా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న రాజకీయ ప్రణామాలను పరిశీలిస్తే తెలంగాణ సీఎం సాధారణ రాజకీయ నాయకుడిగా కాకుండా అసాధారణ వ్యక్తిగా ఎదుగుతున్నట్టు అర్థమవుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ విషయంలో ప్రతిపక్షాలు భయపడి సాధారణ సమ్మతిని కూడా రద్దు చేశాయి. ఇలాంటి స్థితిలో ధైర్యంగా జీవో నెంబర్ 51 ను వెనక్కి తీసుకున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి తనను తాను.. తన పార్టీని కూడా రక్షించుకోగలను అనే ధీమా అతడిలో ఉంది. ఒక రకంగా ఇది రాహుల్ వల్ల కూడా కాలేదు. రాహుల్ లాంటి వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థలను నిందిస్తున్న వేళ.. తెలంగాణ సీఎం వేసిన అడుగులు ఆశ్చర్యకరం. రేవంత్ కంటే కూడా ఢిల్లీలో బలం ఎక్కువగా ఉన్న నాయకుడిగా చంద్రబాబు పేరు గడించాడు. అటువంటి వ్యక్తి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ విషయంలో 2019లో జాగ్రత్త పడితే.. రేవంత్ మాత్రం ఏ మాత్రం భయం లేకుండా వ్యవహరిస్తున్నాడు.. కేంద్ర దర్యాప్తు సంస్థ కాళేశ్వరం విషయంలో ముందుకు వెళితే.. ఒకవేళ అక్కడే ఆగిపోతే తెలంగాణ ముఖ్యమంత్రికి వచ్చే ఇబ్బంది లేదు. అంతేకాదు రాజకీయంగా ఆయనకు అనేకంగా లాభాలు ఉన్నాయి. ఒకవేళ అనుకున్న పలుకుబడితో కేసీఆర్ నిర్దోషి అని చెప్పించుకున్నప్పటికీ.. తన దగ్గర ఉన్న ఆధారాలను తెలంగాణ ముఖ్యమంత్రి మొహమాటం లేకుండా బయటపడతాడు.
పట్టు పెంచుకున్నాడు
ఇటీవల నేషనల్ సర్కిల్స్ లో జరిగిన చర్చ ప్రకారం.. కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఏ స్థాయిలో పట్టు ఉందో.. తెలంగాణ ముఖ్యమంత్రి కి కూడా అదే స్థాయిలో పట్టు ఉంది. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో మైండ్ గేమ్ ను ప్రదర్శించిన తెలంగాణ సీఎం.. గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా చేశాడు. చాలామంది అనుకుంటున్నట్టుగా తెలంగాణ త్రీ గోర్జెస్ విషయంలో తెలంగాణ సీఎం టార్గెట్ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి కాదు. ఇప్పటికీ అతడు రక్షణాత్మక ధోరణిలోనే ఉన్నాడు.. ఒకవేళ ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన దానిమీద దృష్టిసారించలేదు. గులాబీ పార్టీపై సానుభూతి పెంచడం ఎందుకు అన్నట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహరించినట్టు తెలుస్తోంది.. అందువల్లే అత్యంత తెలివిగా బంతిని కేంద్రం కోర్టులో వేశాడు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇచ్చే విషయంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వేం నరేందర్ రెడ్డి కి మినహా మిగతా ఎవరికి కూడా సమాచారం లేదు. అంతేకాదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అత్యంత సీరియస్ గా తీసుకున్నాడు. అజహారుద్దీన్ కు ఉన్నట్టుండి ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఒకరకంగా ఇది గులాబీ పార్టీకి రేవంత్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్. అజహారుద్దీన్ కు టికెట్ ఇస్తే దివంగత ఎమ్మెల్యే భార్యను బరిలోకి దింపి గెలుద్దామని.. తద్వారా రేవంత్ పరిపాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని గులాబీ పార్టీ ప్రచారం చేద్దామనుకుంది. కానీ ఆ ప్రచారానికి చెక్ పెట్టాడు రేవంత్.. అంతేకాదు మాజీ క్రికెటర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి.. గడచిన ఎన్నికల్లో ఓడిపోయిన నవీన్ యాదవ్ కు టికెట్ కన్ఫామ్ చేశాడు. స్థూలంగా చెప్పాలంటే కాళేశ్వరం ఇప్పట్ల తేలకపోవచ్చు.. కాకపోతే గులాబీ పార్టీ ఒకప్పటి మాదిరిగా ఒకప్పటి మాదిరిగా పనిచేయలేదు. అది తెలంగాణ ముఖ్యమంత్రి వేసిన స్కెచ్.