https://oktelugu.com/

Jeevan Reddy: రాజీనామా యోచనలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ఇంటికెళ్లిన భట్టి.. ఏం జరుగుతోంది?

Jeevan Reddy: జీవన్‌రెడ్డి అలకబూనడంతో కాంగ్రెస్‌ నేతలు రంగంలోకి దిగారు. మొదటి రోజు విప్‌లు ఆది శ్రీనివాస్, మంత్రి శ్రీధర్‌బాబు జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు.

Written By: , Updated On : June 25, 2024 / 03:12 PM IST
Jeevan Reddy will resign from MLC

Jeevan Reddy will resign from MLC

Follow us on

Jeevan Reddy: తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌ తలనొప్పిగా మారింది. జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవడంతో మొదలైన పొలిటికల్‌ మీట్‌ రెండో రోజులుగా కొనసాగుతోంది. సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరికను కాంగ్రెస్‌ సీనియన్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఒప్పుకోవడం లేదు. పార్టీలో తానో.. అతనో.. అనే విధంగా జీవన్‌రెడ్డి అల్టిమేట్‌ ఇచ్చారు.

కొనసాగుతున్న బుజ్జగింపులు..
జీవన్‌రెడ్డి అలకబూనడంతో కాంగ్రెస్‌ నేతలు రంగంలోకి దిగారు. మొదటి రోజు విప్‌లు ఆది శ్రీనివాస్, మంత్రి శ్రీధర్‌బాబు జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అయినా జీవన్‌రెడ్డి మెత్తపడలేదు. దీంతో మంగళవారం మరోమారు జీవన్‌రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి దీపదాస్‌మున్షీ జీవన్‌రెడ్డితో మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి మరోమారు జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కోరారు. అయితే తనకు తెలియకుండా తన నియోజకవర్గం ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్నే జీవన్‌రెడ్డి తప్పు పడుతున్నారు.

రాజీనామాకే మొగ్గు..
ఇదిలా ఉండగా జీవన్‌రెడ్డి ఇంటికి ఆయన అనుచరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. తమ నేత ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామంటున్నారు. ఈ క్రమంలో తాజాగా జీవన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గాంధీభవన్‌లో నిరసన తెలియజేయడానికి కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీ కోసం ఇంతకాలం కష్టపడి పనిచేశానని.. కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందని జీవన్‌రెడ్డి పేర్కొంటున్నారు. తాను పదవిలో గౌవరం కోరుకుంటున్నానని, అది తనకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీపాదాస్‌ మున్షితో చర్చల తర్వాత..
చివరగా తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో చర్చించనున్నారు. ఈమేరకు ఆమె గాంధీ భవన్‌కు వస్తారని సమాచారం. ఆమెతో చర్చించిన తర్వాత రాజీనామాపై జీవన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారనని ఆయన అనుచరులు చెబుతున్నారు. తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.