https://oktelugu.com/

Chandrababu Naidu: తమ్ముళ్లకు చంద్రబాబు శీల పరీక్ష.. నెగ్గితేనే నామినేటెడ్‌ పోస్టు!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా.. ఎన్నికల ముందు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కూటమి సర్కార్‌ ఏర్పడింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 25, 2024 3:19 pm
    AP Nominated Posts Will Be Filled Up Soon

    AP Nominated Posts Will Be Filled Up Soon

    Follow us on

    Chandrababu Naidu: ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో తెలుగు తమ్ముళ్లు నామినేటెడ్‌ పదవులపై ఆశ పెట్టుకున్నారు. త్వరలోనే నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు ట్విస్ట్‌ ఇచ్చారు. నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్న వారిక శీల పరీక్ష పెట్టాలని నిర్ణయించారు. ఈ పరీక్షలో నెగ్గిన వారికే పదవులని క్లారిటీ ఇచ్చారు.

    కూటమి నేపథ్యంలో..
    ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా.. ఎన్నికల ముందు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కూటమి సర్కార్‌ ఏర్పడింది. దీంతో నామినేటెడ్‌ పదవుల విషయంలోనూ కూటమి పార్టీలకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో నేతల మధ్య సీనియర్, జూనియర్‌ అన్న భేదాభిప్రాయాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. టీడీపీలో సహజంగానే పోటీ ఎక్కువ. ఈ క్రమంలో పోటీ తగ్గించేందుకు చంద్రబాబు నాయకుడు శీల పరీక్షకు సిద్ధమయ్యారు.

    పెరిగిన పదవులు…
    గతంలో ఏపీలో 26 సామాజికవర్గాల కార్పొరేషన్లు ఉండేవి. జగన్‌ సీఎం అయ్యాక వాటిని 56కు పెంచారు. దీంతో నామినేటెడ్‌ పదవుల సంఖ్య పెరిగింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతోనూ చైర్మన్‌ పదవులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక మండలి కూడా ఏరాపటు చేశారు. దీనిలో 12 మందిని నామినేటెడ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇతర నామినేటెడ్‌ పోస్టులు, ఆలయాల పాలక మండళ్లు, వక్ఫ్‌బోర్డు పదవులు ఉంటాయి. మొత్తంగా 250 నుంచి 300 వరకు నామినేటెడ్‌ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు సలహాదారు పదవులు కూడా ఉన్నాయి.

    మూడు పార్టీల నుంచి ఎంపిక..
    ఈ నామినేటెడ్‌ పదవులకు మూడు పార్టీల నుంచి ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందులో సీనియారిటీ, కుల సమీకరణ, విధేయత, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో పోటీ తగ్గించేందుకు చంద్రబాబు తెలివిగా వ్యవహరించారు. నామినేటెడ్‌ పదవులకు పోటీ పడుతున నేతలపై జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. పార్టీ కోసం ఎవరు ఏమేరకు కష్టపడ్డారో తెలుసుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. కష్టపడిన వారికి మాత్రమే పదవులు దక్కుతాయని క్లారిటీ ఇచ్చారు.

    పరీక్ష నెగ్గాలి..
    చంద్రబాబు ఇచ్చిన ట్విస్ట్‌తో తమ్ములు ఇపుడు శీల పరీక్షలో నెగ్గాలి. కేవలం మీడియా ముందు షో చేసినవారికి కాకుండా క్షేత్రస్థాయిలో కష్టపడిన నేతల వివరాలు సేకరిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉ న్నవారిని గుర్తిస్తున్నారు. పోలీసుల నిర్భందాలను ఎదుర్కొని కేసులపాలైన నేతలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. మీడియా ముందు షో చేసే నేతలు తాజా నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా చంద్రబాబు ఆలోచన బాగున్నా.. అమలు చేయడం కూడా కష్టమే.