Jagga Reddy: 2023లో తెలంగాణ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. నాటి నుంచి విజయవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన ఆయన.. వాటిని అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. ఇటీవల మరో నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నప్పటికీ.. ఆయనను ముఖ్యమంత్రిగా సంబోధించడంలో కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది పుష్ప సినిమా విడుదలై, విజయవంతమైన నేపథ్యంలో.. ఏర్పాటుచేసిన వేడుకలో ఆ చిత్ర హీరో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించడంలో విఫలమయ్యారు. ముఖ్యమంత్రి పేరును మర్చిపోయారు. ఆ తర్వాత పుష్ప -2 విడుదల సందర్భంగా రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ తర్వాత వివాదం మొదలైంది. అది కాస్త అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసింది. నాడు అల్లు అర్జున్ అరెస్టుకు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమే ఓ కారణమని అప్పట్లో వార్తలు వినిపించాయి.. ఇక ఇటీవల హైదరాబాదులో తెలుగు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేక అతిథిగా పిలిచారు. అయితే ఆయనను వేదిక మీదకు ఆహ్వానించే క్రమంలో రేవంత్ రెడ్డి పేరును కాస్త కిరణ్ కుమార్ రెడ్డి అని సంభోదించారు. అది కాస్త వివాదంగా మారింది.
తూర్పు జగ్గారెడ్డి కూడా..
రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన వారి జాబితాలో కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి కూడా చేరిపోయారు.. శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పేరును కిరణ్ కుమార్ రెడ్డి గా సంభోదించారు. ఆ తర్వాత వెంటనే క్షమించాలని అడిగినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ” ముఖ్యమంత్రి పేరును మర్చిపోవడం ఇది మూడోసారి. గతంలో అల్లు అర్జున్.. ఇటీవల బాలాదిత్య.. ఇప్పుడు జగ్గారెడ్డి.. రేవంత్ రెడ్డిని కావాలనే అవమాన పరుస్తున్నారు. దీని వెనుక ఏదో జరుగుతోంది. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం.. వాటిని ఓ వర్గం సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది.. దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇలాంటి పరిణామాలు మునుముందు కాలంలో మరింత తీవ్రంగా జరుగుతాయని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
జగ్గారెడ్డి విమర్శలు చేసిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకులు, భారత రాష్ట్ర సమితి అనుబంధ సోషల్ మీడియా రెచ్చిపోవడం మొదలుపెట్టాయి. రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడం మూడోసారి అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించాయి.. అయితే దీనికి కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు.
దెబ్బ మీద దెబ్బ
రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం
రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన జగ్గారెడ్డి
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ తడబడిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.#CongressFailedTelangana #Congress #Jaggareddy pic.twitter.com/xt2bB36oMt
— ️ (@TSTalks4YOU) February 1, 2025