CM Revanth Reddy: రేవంత్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి.. ఆ 10 మంది భవిష్యత్తు ఏంటి?

తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇటీవల అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. విచారణ ప్రారంభించకపోతే.. తామే సుమోటోగా విచారణ చేస్తామని కోర్టు ఆదేశాలు వచ్చి 15 రోజులు గడిచింది. దీంతో స్పీకర్‌ ఏం చేయబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది.

Written By: Raj Shekar, Updated On : September 23, 2024 5:04 pm

CM Revanth Reddy(13)

Follow us on

CM Revanth Reddy: తెలంగాణలో పొలిటికల్‌ హైటెన్షన్‌ పెరుగుతోంది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడానికి హైకోర్టు విధించిన గడువు సమీపిస్తోంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు బీఆర్‌ఎస్‌కు దక్కాల్సిన పీఏసీ చైర్మన పదవి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కేటాయించింది. దీంతో బీఆర్‌ఎస్‌ రగిలిపోతోంది. మరోవైపు కోర్టు గడువు సమీపిస్తోంది. దీంతో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. పీఏసీ చైర్మన్‌ నియామకంపై ఇప్పటికే స్పీకర్‌ విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి రూల్స్‌కు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడంపై బీఆర్‌ఎస్‌ విమర్శలు చేస్తోంది. అయితే స్పీకర్‌ నిర్ణయం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

త్వరలో పది మంది భవితవ్వంపై నిర్ణయం..
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యే భవితవ్యంపైనా స్పీకర్‌ త్వరగా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అరికెపూడి గాంధీని బీఆర్‌ఎస్‌ సభ్యుడుగానే పరిగణిస్తూ.. తొమ్మిది మంది విషయంలో స్పీకర్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఉప ఎన్నికలు రాకుండా.. అనర్హత వేటు పడకుండా స్పీకర్‌ నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలను అనర్హత నుంచి బయట పడేసేందుకు అధికార కాంగ్రెస్‌ వ్యూహాలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.

అభివృద్ధి కోసమే అని..
ఇదిలా ఉంటే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఒకటే కారణం చెబుతున్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారామని అంటున్నారు. అధికార పార్టీలో ఉంటే నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు. ఇది బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెడుతోంది. గతంలో కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఇదే విషయం చెప్పారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారూ అదే చెబుతున్నారు. ఈ పరిస్థితిలో ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠ పెరుగుతోంది.