Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. త్రిముకపూర్ లో భాగంగా మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. మరోవైపు సర్వే సంస్థలు కూడా యూనియన్ పోలుస్తూ ఎవరు అధికారంలోకి వస్తారని అంచనా వేస్తున్నాయి. సర్వే లెక్కల ప్రకారం పార్టీలు మానసికంగా సిద్ధపడుతున్నాయి. 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏబీపీ సీ ఓటర్ సంస్థ తాజాగా ఓపినియన్ పోల్ 2023 విడుదల చేసింది. ఈ పోల్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ కు 19 స్థానాలు రాగా.. ప్రస్తుత అంచనా ప్రకారం కాంగ్రెస్ 43 నుంచి 55 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఇక అధికార బీఆర్ఎస్ భారీగా నష్టపోతుందని సర్వే తేల్చింది. 49 నుంచి 61 స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా వేసింది.
ఓట్ల శాతం ఇలా..
ఓట్ల పరంగా కాంగ్రెస్ గణనీయమైన వృద్ధిని సాధించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 28.3 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ప్రస్తుత అంచనా ప్రకారం 39.4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఓటింగ్ 11.1 శాతం పెరగొచ్చని భావిస్తున్నారు. ఈ పెరుగుదల రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో 46.9 శాతం ఓట్లతో ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ -6.4 శాతం తగ్గదలతో ఓట్లతో 40.5 శాతం ఓట్లు సాధిస్తుందని అంచనా సర్వే అంచనా వేసింది.
కెసిఆర్ పై పెరిగిన వ్యతిరేకత
ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఒపీనియన్ పోల్ లో 37 శాతం మంది మద్దతు తెలిపాటు. 42.4 శాతం మంది కేసిఆర్ప నితీరును వ్యతిరేకించారు. ఆయన తర్వాతి స్థానాల్లో రేవంత్ రెడ్డి (ఐఎన్‌సీ) 31.2 శాతం, బండి సంజయ్ (బీజేపీ) 10.7 శాతం, అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం) 2.1 శాతంతో ఉన్నారు. తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునే విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి 31.2 శాతం మద్దతుతో ముందంజలో ఉన్నారు. బీజేపీకి చెందిన బండి సంజయ్, ఇతర అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు.
నిర్ణయించేది ఒక్క శాతమే..
ఓట్ల శాతం పరంగా చూసినట్లయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒక్క శాతం మాత్రమే తేడా ఉంది. అంటే చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీతో అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. అధికారం ఎవరికి దక్కుతుంది అనేది ఆ ఒక్క శాతం నిర్ణయించనుంది. కాంగ్రెస్ వైపు మొగ్గుచూపితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపితే బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుంది. అలా కాకుండా ఒక శాతం బిజెపి ఎంఐఎం ఇతర పార్టీలో వారీగా చీలితే హంగ్ తప్పదని సర్వే తేల్చింది. మరి కీలకంగా మారిన ఒక్క శాతం ఓటర్లు ఎటు మోగ్గుతారో.. ఎన్నికల ఫలితాలు ఒపీనియన్ పోల్ కు దగ్గరగా ఉంటాయో లేదో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే..!