హైదరాబాద్ మునగడానికి నేతల కబ్జాల కారణమా?

చిన్న వాన పడితే చాలు వాన వస్తుంది. హైదరాబాద్ నీట మునుగుతుంది. దారుణం ఏంటంటే ఈ మధ్య ఈ వరదల్లో చిన్నారులు సైతం కొట్టుకుపోయిన చనిపోతున్నారు.  ఓ చిన్నారి బాలిక సుమేధ అందులో పడి కొట్టుకుపోయింది.ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్, మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పై సుమేధ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలాలపై కప్పులు లేకుండా చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించి తన బిడ్డ ప్రాణాలు పోయేలా చేశారని ఆరోపించాడు. Also Read: దేశవ్యాప్త రైతు ఉద్యమానికి […]

Written By: NARESH, Updated On : September 22, 2020 4:05 pm

rain in hyderaba

Follow us on

చిన్న వాన పడితే చాలు వాన వస్తుంది. హైదరాబాద్ నీట మునుగుతుంది. దారుణం ఏంటంటే ఈ మధ్య ఈ వరదల్లో చిన్నారులు సైతం కొట్టుకుపోయిన చనిపోతున్నారు.  ఓ చిన్నారి బాలిక సుమేధ అందులో పడి కొట్టుకుపోయింది.ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్, మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పై సుమేధ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలాలపై కప్పులు లేకుండా చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించి తన బిడ్డ ప్రాణాలు పోయేలా చేశారని ఆరోపించాడు.

Also Read: దేశవ్యాప్త రైతు ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం?

ఈ క్రమంలోనే హైదరాబాద్ లో కబ్జాలపై తాజాగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్లో భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. నాలాల వద్ద సరైన నిర్వహణ లేక అందులో పిల్లలు కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని ఆరోపించారు.

ఎల్బీనగర్ లోని రెడ్డి నగర్ కాలనీలో నాలా ప్రాంతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించాడు. ఈ నిర్మాణాలు కూల్చేయండని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ విషయంలో ఏం జరిగినా తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు.

Also Read: “అడెల్లు” కోసం వేట.. తెలంగాణ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్

కాలనీల్లో కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు సహాయ చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ తక్షణమే పర్యటించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు ప్రజలు అందుబాటులో ఉండట్లేదని అన్నారు.

ఇలా హైదరాబాద్ లో వరద వినాశనంపై ప్రతిపక్షంలో కదలిక వచ్చింది. అధికారపక్షంలోనూ అలజడి మొదలైంది. మరి హైదరాబాదీల కష్టాలు తీరుతాయా.? చిన్నారుల ప్రాణాలకు రక్షణ ఉందా?  అన్నది వేచిచూడాలి.