Telangana CM: తెలంగాణలో ఏడాది కాలంగా రాజయీయాలు గరం గరంగానే సాగుతున్నాయి. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధి అని చెప్పే నాయకులు కూడా రాజకీయాలే చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు గడిచినా.. దానిని కుదురుకోనివ్వడం లేదు. విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారు. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ నేతలు విపక్షాల దూకుడును అడ్డుకోలేకపోతున్నారు. తాజాగా సీఎం పీటంపై దృష్టిపెట్టారు. త్వరలో తెలంగాణ సీఎం మారబోతున్నారని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు జోష్యం చెబుతున్నారు. ఇందుకు కాంగ్రెస్ నాయకులే తెరవేనెక కుట్ర చేస్తున్నారని పేర్కొంటున్నారు. 2025 డిసెంబర్ వరకు తెలంగాణలో సీఎం మారతారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తాజాగా బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కూడా 2025 జూన్ నుంచి డిసెంబర్‌లోగా సీఎం మారిపోతారని పేర్కొంటున్నారు. అందుకే సీఎంకు రాహుల్, ప్రియాంక అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
అంత కాన్ఫిడెన్స్ ఏంటి..
రేవంత్‌రెడ్డిపై మహేశ్వర్‌రెడ్డి అంత కాన్ఫడెన్స్‌గా వ్యాఖ్యలు చేయడంపైనా ఇపుపడు చర్చ జరుగుతోంది. మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ రాజకీయాలు తెలిసిన నేత. 2023 ఎన్నికల ముందు వరకు ఆయన కాంగ్రెస్‌లోనే పనిచేశారు. అక్కడి రాజకీయాలు, అధిష్టానం నిర్ణయాలపై ఆయనకు అవగాహన ఉంది. అయితే కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరారు. కానీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ ఎందుకు మారానా అని నాలుక కరుచుకున్నారు. కానీ, బీజేపీలో ఆయనకు కీలక పదవే దక్కింది.
వారితో సత్సంబంధాలు..
ఇక బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డికి ఇప్పటికీ కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి. మంత్రి పదవి ఇస్తే పార్టీ మారతానని ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే రాయబారం పంపారట. కానీ, రేవంత్‌రెడ్డి ఆయనను వద్దనుకున్నారు. అందుకే ఆయన కోపంతో ఉన్నారు. ఎన్నికల ముందు కూడా రేవంత్‌రెడ్డితో పొసగకనే కాంగ్రెస్‌ను వీడారు. ఇక ఇప్పుడు కూడా రేవంత్‌రెడ్డినే బీజేఎల్పీ నేత టార్గెట్ చేస్తున్నారు.
అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదా?
ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు మహేశ్వర్‌రెడ్డి. అయితే ఈ వ్యాఖ్యల్లో నిజమెంత అని రేవంత్‌రెడ్డి ఢిలీ పర్యటనలు చూస్తే అర్థమవుతుంది. హైడ్రా కూల్చివేతలపై రేవంత్‌రెడ్డి రాహుల్‌ను కలిశారు. వయనాడ్‌లో ప్రియాంకగాంధీ నామినేషన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంకను కూడా కలిశారు. రేవంత్‌కు హైకమాండ్ వద్ద మంచి గుర్తింపు, పలుకుబడి ఉంది. అందుకే ఆయనను పీసీసీ పదవితోపాటు సీఎం పదవి వరించింది. కానీ మహేశ్వర్‌రెడ్డి టార్గెటెడ్‌గా మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా పాతుకుపోవడం ఇష్టంలేని కొందరు నేతలు విపక్షాలకు ఉప్పందిస్తున్నారు. దీంతోనే విపక్ష నేతలు ఇలా మాట్లాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Is the change of cm certain in telangana what is the truth in the oppositions allegations
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com