KTR and Bandi Sanjay: రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఒకే విధంగా ఉంటే వాటిని రాజకీయాలు అనరు. పేరుకు సమర్థవంతమైన పరిపాలన.. ప్రజలకు సంక్షేమం.. భద్రత.. ఇలా రకరకాల మాటలు నేతలు చెబుతుంటారు కానీ.. అంతిమంగా స్వీయ సంక్షేమాన్ని మాత్రమే నేతలు కోరుకుంటారు. దానికోసం ఎన్ని వేషాలైనా వేస్తారు. ఎంత దూరమైనా ప్రయాణిస్తారు. అవసరమైతే అప్పటిదాకా తిట్టిన నాయకుడితో ఆలింగనం చేసుకుంటారు. అప్పటిదాకా కలిసి ప్రయాణం చేసిన నాయకుడిని దూరం చేసుకుంటారు.. అందుకే స్మశానం ముందు ముగ్గు.. రాజకీయ నాయకులకు సిగ్గు ఉండవు అంటారు.
జాతీయ రాజకీయాలను కాస్త పక్కన పెడితే.. తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కాలంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న చర్చ బిజెపి, కారు పార్టీ కలిసి పోతాయని.. గులాబీ బాస్ కుమార్తె మద్యం వ్యవహారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు కమలం, కారు దోస్తీ గురించి చర్చ జరిగిందట. ఒకానొక సందర్భంలో కారు పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు.. తన సోదరికి బెయిల్ ఇప్పిస్తే.. ఈ కేసు నుంచి తప్పిస్తే తన పార్టీని కమలంలో విలీనం చేస్తానని మాట కూడా ఇచ్చాడట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ పార్లమెంట్ సభ్యుడు బయటపెట్టారు.. దానిని గులాబీ పార్టీ నాయకులు ఖండించినప్పటికీ.. అంతర్గతంగా జరిగింది అదే అని చర్చ మొదలైంది. అంతేకాదు ఇటీవల జాగృతి అధినేత్రి కూడా కారు, కమలం దోస్తీ గురించి మాట్లాడారు.. అయితే దానికి తాను ఒప్పుకోలేదని కుండ బద్దలు కొట్టారు.
ఈ పరిణామాలు జరగబోయే విలీనానికి సూచికలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాటికి బలం చేకూర్చుతూ కేటీఆర్, బండి సంజయ్ గురువారం పరస్పరం తారసపడ్డారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు.. ఉప్పు నిప్పులాగా ఉండే వీరిద్దరూ పరస్పరం ఎదురు పడటం.. కుశల ప్రశ్నలు వేసుకోవడం ఒకరకంగా చూసేవారికి ఆనందాన్ని కలిగించింది.. అయితే ఈ కలయికను ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవద్దని.. దీని వెనక చాలానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఎందుకంటే తెలంగాణలో పాగా వేయాలని కమలం పార్టీ అనుకుంటున్నది. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీకి అనుకున్నంత బలం లేదు. అలాంటప్పుడు కారుతో దోస్తీ కడితే తెలంగాణలో సంయుక్తంగా అధికారం దక్కించుకోవచ్చనేది కమలం పార్టీ ప్లాన్. అయితే ఇది వర్క్ అవుట్ అవుతుందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే లభిస్తుంది. కమలంతో దోస్తీకి కేటీఆర్ కూడా సుముఖంగా ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు పార్టీలో పెతనం కూడా కేటీఆర్ దే కావడంతో.. అంతిమంగా ఆయన ఏం చెబితే అదే ఫైనల్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికైతే ఇలానే సాగుతున్నాయి చర్చలు. భవిష్యత్ కాలంలో ఏ వైపు టర్న్ తీసుకుంటాయి.. ఎలా మారిపోతాయి అనేది చూడాల్సి ఉంది.
FLOOD POLITICS – BJP STYLE
Interesting how MoS Home Bandi Sanjay rushed to Sircilla constituency and not to Medak and Kamareddy which are very severely affected!
Before even Bandi Sanjay reached Sircilla, BRS working president and Sircilla MLA KTR was already touring his… pic.twitter.com/FyxYJBzYQ2
— Revathi (@revathitweets) August 28, 2025