Revanth Reddy: తెలంగాణలో రాజకీయ రోజురోజుకు హీటెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో నువ్వా? నేనా? అన్న రీతిలో పోరు కొనసాగుతోంది. మహామహులు, పార్టీ అధ్యక్షులు ఒకేచోట పోటీలో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా బరిలో ఉండడం పొలిటికల్ గా హీట్ ను పెంచుతోంది. రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంతో పాటు కొడంగల్ లో కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన నామినేషన్ సందర్భంగా ప్రతీ ఊరు నుంచి కొందరు వచ్చారు. దీంతో జనాన్ని చూసి రేవంత్ రెడ్డి మురిసిపోయారు. ఈ తరుణంలో కొడంగల్ లో ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతుందా? అనేది ఆసక్తిగా మారింది.
గత రెండు పర్యాయాలు ఇక్కడ రేవంత్ రెడ్డి ఓడిపోయారు. పట్నం మహేందర్ రెడ్డి అండదండలతో ఎంతో ప్రయత్నించినా బీఆర్ఎస్ జెండానే ఎగిరింది. ఎంపీగా పోటీ చేసిన ఆయన గెలుపొందారు. ఈసారి మాత్రం రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆయనతో పాటు పార్టీని గెలిపించారు. దీంతో పరోక్షంగా కొడంగల్ లో ఆయనకు మద్దుత పెరిందిన్న ప్రచారం వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో గెలుపొందిన నరేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. అవి నేరవేర్చలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో కేటీఆర్ సైతం వచ్చి అండదండగా ఉంటామని హామీ ఇచ్చి ఐదేళ్ల వరకు పట్టించుకోలేదని అంటున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకోవడం కష్టమేనని అంటున్నారు. ఇవే కాకుండా ప్రతీ అభ్యర్థి విజయం వెనుక గురునాథ్ రెడ్డి కీలకం అవుతున్నారు. ఆయన ఈ నియోజకవర్గంలో 5 సార్లు ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ లోకి చేరారు. దీంతో రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ గా మారిందని అంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతుండడంతో ఆయన సొంత నియోజకవర్గంపై దెబ్బ కొట్టడానికి బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో ప్రత్యేక వార్ రూం ఏర్పాటు చేసినట్లు సమాచారం. కొడంగల్ అభ్యర్థి మహేందర్ రెడ్డి కి ఎప్పటికప్పడు సూచనలు ఇస్తూ తాము చెప్పింది చేయాలంటున్నారు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దని చెబుతున్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడా? లేక బీఆర్ఎస్ పాగా వేస్తుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది.