Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ నటుడిగా ఎదిగిన కృష్ణ తన ప్రస్థానాన్ని ఎదురులేకుండా కొనసాగించారు. ఇక ఈయన తొలి నాళ్లలో పండంటి కాపురం సినిమా చేశారు. ఒక మంచి కుటుంబ కథా చిత్రం అవడంతో ప్రేక్షకుల హృదయాలను తాకింది ఈ సినిమా. కథ చాలా నచ్చడంతో సొంతం నిర్మించారు కూడా. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగిందట. దాన్ని సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మేన్ సి. మాధవరావు వెల్లడించారు. ఇంతకు ఏం జరిగిందంటే…
ఈ సినిమా కథలో నలుగురు అన్నదమ్ములుంటారు. వారిలో పెద్ద ఎస్వీ రంగారావు, ఆయన కంటే అంటే సూపర్ స్టార్ కు ఎనలేని గౌరవం. ఇందులోని ఓ పాట చిత్రీకరణ కోసం శివాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేశారట. కానీ రంగారావు అక్కడికి రాలేదట. బాగా తాగి ఇంట్లో ఉండిపోయారట. ఈయనను తీసుకురావడానికి సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి వెళ్లారట. బతిమిలాడి షూటింగ్ స్పాట్ కు తీసుకొని వచ్చారు. కానీ రంగారావు మాత్రం సాకులు చెప్పి షూటింగ్ నుంచి తప్పించుకున్నారట. ఈ రోజు నాతో కాదని.. తనను వదిలేయాలని అన్నారట.
ఈ మాటలు విన్న ప్రభాకర్ రెడ్డి కి కోపం వచ్చి మాట తూలారట. చంపేస్తాను ఏమనుకున్నావో.. ఇంతమంది ఆర్టిస్టుల కాంబినేషన్ లో షూటింగ్. వీరంతా మళ్లీ ఒకసారి దొరకరని అరిచారట. దీంతో రంగారావుకు కోపం వచ్చి ఏంటి నన్నే చంపేస్తావా. అయితే చంపెయ్ గ్రేట్ రంగారావును చంపెయ్ అంటూ అరిచారట. వెంటనే తాను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకొని కాళ్లు పట్టుకొని క్షమించమని అడిగారట. ఇక ఈ ఘటన తర్వాత రంగారావు ఇంటికి వెళ్లారట. దీని తర్వాత కృష్ణ వద్దకు వెళ్లారట గుమ్మడి. రంగారావు తప్ప మరో ఆర్టిస్ట్ లేరా అని అడిగితే.. తాగుబోతు అనే కారణం వల్లనే హరనాథ్ ను పక్కన పెట్టారు. మళ్లీ ఇప్పుడు రంగారావా? అని సమాధానం ఇచ్చారట.
ఈ పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేయగలరని, మరెవరు ఆ వేషం వేయలేరని అన్నారట కృష్ణ. బతిమిలాడైన ఈ పాత్రను ఆయనతోనే చేయించాలి అన్నారట. ఈ మాటలు విన్న మేకప్ మేన్ వెళ్లి రంగారావుకు చెప్పడంతో ఓ నిర్ణయం తీసుకున్నారు రంగారావు. నాపై కృష్ణ ఇంత నమ్మకం పెట్టుకున్నారా? అయితే ఇక నుంచి సినిమా కంప్లీట్ అయ్యేవరకు మందు తాగను శపథం చేశారట. అనుకున్నట్టుగానే సినిమాలో ఆయన పాత్ర సూపర్ గా వచ్చింది. ఇలా తన మంచి మనుసు చాటుకొని ఓ ఆర్టిస్టును సినిమా నుంచి తీసేయాల్సి వచ్చినా తీసేయలేదని కృష్ణ గురించి సి. మాధవరావు కొనియాడారు.