Black Berry Island: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఐదు ఎకరాలలో పర్యాటకశాఖ బ్లాక్ బెర్రీ దీవిని ఏర్పాటు చేసింది. ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతను అందించేందుకు సిద్ధమైంది. నగరవాసుల నుంచి మొదలుపెడితే గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అందమైన అనుభూతిని అందించేందుకు రెడీ అయింది. జలగలాంచ వాగు మధ్యన సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రకృతి వనం రూపొందింది. ఇక్కడ 365 రోజులు చల్లని వాతావరణం ఉంటుంది. దట్టమైన అడవి మధ్యలో ఈ ప్రకృతి వనం ఉంది. మరి కొద్ది రోజుల్లో ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్ ప్రారంభం కానుంది. పర్యాటకులు మెచ్చేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇతర ఐలాండ్ లకు మించి ఇక్కడ సౌకర్యాలు కల్పించారు.
రాత్రి ఉండేందుకు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు రాత్రిపూట ఇక్కడ ఉండడానికి ఆధ్యాత్మిక 50 గుడారాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు మాత్రమే ఉండేలా 25 గుడారాలు.. ముగ్గురు మాత్రమే ఉండేలాగా 21 గుడారాలు.. నలుగురు మాత్రమే ఉండేలాగా నాలుగు గుడారాలను ఏర్పాటు చేశారు. వీటిని అత్యంత ఆధునిక పద్ధతుల్లో నిర్మించారు.
బీచ్ వాలీబాల్ ఆడేందుకు
ఈ ఐలాండ్లో యువత బీచ్ వాలీబాల్ ఆడేందుకు కోర్టు సిద్ధం చేశారు. చిన్నారుల కోసం షటిల్ కోర్టులు కూడా రూపొందించారు. ఇక్కడ కబడ్డీ, ఖోఖో కూడా ఆడుకోవచ్చు. ఈ ప్రాంతంలో జలగలాంచవాగు నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈబాగులో చేపల వేటను కూడా చేసుకునేందుకు సదుపాయాలు కల్పించారు.
సోలార్ పవర్ తో
బ్లాక్ బెర్రీ ఐలాండ్ తాడ్వాయి పస్రా మధ్యలోని అటవీ ప్రాంతంలో ఉంటుంది. 163 జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఐలాండ్లో రాత్రి మొత్తం గడిపేందుకు పర్యాటకు అవకాశం ఉంటుంది. దట్టమైన అడవి కాబట్టి పర్యాటకుల కోసం సోలార్ విద్యుత్ సదుపాయాన్ని పర్యాటకశాఖ అధికారులు కల్పించారు. వెదురు బొంగులతో కంచే ఏర్పాటు చేశారు. రక్షణ సిబ్బంది గా పోలీసులను నియమించారు.
నచ్చిన భోజనం
ప్రకృతి ఒడిలో ఉంటారు కాబట్టి ఇక్కడ నచ్చిన భోజనం తినేందుకు పర్యాటకులకు అవకాశం ఉంటుంది. పర్యాటకుల అభిరుచి మేరకు ఇక్కడ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ, భారతీయ వంటకాలను ఇక్కడ సిద్ధం చేసేందుకు నల భీములను ఏర్పాటు చేశారు.. చలి మంటలు కాచుకునేందుకు ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకునే అవకాశం ఉంది. దాని చుట్టూ కూర్చుని స్నేహితులు సరదాగా కబుర్లు చెప్పొచ్చు. అడవిని మొత్తం చూడొచ్చు. దానిని చూడ్డానికి పర్యాటకశాఖ ఏకంగా ఒక మంచి ఏర్పాటు చేసింది.
ఎలా చేరుకోవాలంటే
బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను చేరుకోవడానికి హైదరాబాదు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి బస్సులో రావచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్లు పస్రా వద్ద దిగాలి. ఇక్కడ బస చేయడానికి టూరిజం శాఖ ఏర్పాటు చేసిన అఫీషియల్ యాప్ నుంచి రూం లు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉండే పర్యాటకుల నుంచి రోజుకు సుమారు 1500 – 2000 వరకు చార్జ్ చేస్తారు. టూరిజం శాఖ ప్రత్యేకమైన వెబ్ సైట్ కూడా రూపొందించే పనిలో ఉంది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ త్వరలో ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను ప్రారంభించనున్నారు.
తాడ్వాయి – పస్రా మధ్యలో నిర్మించిన బ్లాక్ బెర్రీ ఐలాండ్ ఆకట్టుకుంటున్నది.ఆధునిక గుడారాలు.. ఫైర్ క్యాంపులు.. రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు.. మంత్రులు సురేఖ, జూపల్లి కృష్ణారావు దీనిని ప్రారంభిస్తారు.. సోమవారం ఐలాండ్ ను మంత్రి సీతక్క పరిశీలించారు. #blackberryIsland#Telangana pic.twitter.com/YKZHmeUaSF
— Anabothula Bhaskar (@AnabothulaB) December 24, 2024