https://oktelugu.com/

Sridhar Babu: శ్రీధర్‌బాబు.. పడి లేచిన కెరటం.. ఎదిగినా ఒదిగి ఉండే తత్వం!

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 1969 మే 30న జన్మించారు. 1999 లో రాజకీయాల్లోకి వచ్చారు. ఉన్నత విద్యావంతుడు అయిన శ్రీధర్‌బాబు ఢిల్లీ, హైదరాబాద్‌ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదివారు.

Written By: Raj Shekar, Updated On : December 7, 2023 5:00 pm
Sridhar Babu

Sridhar Babu

Follow us on

Sridhar Babu: తెలంగాణ రాష్ట్రంలో మంథని నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. అడవులు, మావోయిస్టు ఉద్యమాలకు అడగ్డాగా, మారుమూల నియోజకవర్గంగా గుర్తింపు ఉన్న మంథని నుంచి ప్రధాని పీవీ నిర్సంహారావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఆ రికార్డును దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బ్రేక్‌ చేశారు. ఇక్కడి నుంచి ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. తన తండ్రి మరణానంతరం అనూహ్యంగా రాజకీయాల్లోలకి వచ్చిన శ్రీధర్‌బాబు రాజకీల్లోనూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. విజయాలకు పొంగిపోకుండా, అపజయాలకు కుంగిపోకుండా రాజకీయాలకు అలవాటు పడ్డాడు. పడిలేచిన కెరటంగా, ప్రజల నేతగా గుర్తింపు పొందారు.

1969లో జననం..
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 1969 మే 30న జన్మించారు. 1999 లో రాజకీయాల్లోకి వచ్చారు. ఉన్నత విద్యావంతుడు అయిన శ్రీధర్‌బాబు ఢిల్లీ, హైదరాబాద్‌ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదివారు. తన తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావును మావోయిస్టులు కాల్చి చపండంతో తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. శ్రీపాదరావు 1989 నుంచి 1994 వరకు మంథనికి ప్రాతినిధ్యం వహించారు. 1994లో డీపీ తరఫున చందుపట్లల రాంరెడ్డి గెలిచారు. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్‌బాబు 2014 వరకు వరుసగా హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2014లో మాత్రం టీఆర్‌ఎస్‌ గాలిలో శ్రీధర్‌బాబు ఓడిపోయారు. కానీ 2018లో కూడా తెలంగాణ అంతటా టీఆర్‌ఎస్‌ గాలి వీచినా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ 35 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు.

పీవీ నర్సింహారావు రికార్డు బ్రేక్‌..
అంతకు ముందు మంథనిలో పీవీ నర్సింహారావు పేరిట ఉన్న రికార్డును శ్రీధర్‌బాబు బ్రేక్‌ చేశారు. 2018లో రికార్డు సమయం చేసిన ఆయన, తాజాగా దానిని బ్రేక్‌ చేశారు. పీవీ. నర్సింహారావు 1957 నుంచి 1972 వరకు వరుసగా నాలుగుసార్లు గెలిచారు. శ్రీధర్‌బాబు 1999 నుంచి 2014 వరకు మూడుసార్లు, 2018, 2023 ఎన్నికల్లో గెలిచి ఐదుసార్లు మంథని నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.

భార్య, ఇద్దరు పిల్లలు..
సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు అయిన శ్రీధర్‌బాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య శైలజరామయ్యర్‌ ఐఏఎస్‌ అధికారి. ఇద్దరు పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు. మంథనిలో తన పని తాను చేసుకుపోయే వ్యక్తిగా శ్రీధర్‌బాబుకు గుర్తింపు ఉంది. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రత్యర్థి పేరు ఉచ్చరించకుండా విజయం సాధించే నేత శ్రీధర్‌బాబు.

వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌ కేబినెట్‌లో మంత్రిగా..
ఇక మంథని నుంచి ఆరుసార్లు గెలిచిన శ్రీధర్‌బాబు ఇప్పటికే పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కెబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌ క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఉన్న తవిద్య, ఎన్నారై వ్యవహారాల శాఖ నిర్వహించారు. తర్వాత రోశయ్య క్యాబినెట్‌లో శాసన సభ వ్యవహారాలు, పౌర సరఫరాలు, న్యాయ, శాఖ మంత్రిగా పనిచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో కూడా అవే శాఖలను నిర్వహించారు.

తాజాగా మళ్లీ మంత్రిగా..
తాజాగా రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో శ్రీధర్‌బాబుకు ఛాన్స్‌ దక్కింది. సీనియన్‌ నాయకుడిగా ఉన్న ఆయనకు ఉమ్మడి కరీంనగర జిల్లా నుంచి శ్రీధర్‌బాబుకు మొదటి స్థానం దక్కింది. సీఎం రేవంత్‌తోపాటు, మంత్రిగా శ్రీధర్‌బాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనకు విద్య లేదా ఐటీ శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.