https://oktelugu.com/

CM Revanth Reddy : తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ చైర్మన్‌గా బడా పారిశ్రామిక వేత్త.. అమెరికాలో సీఎం రేవంత్‌రెడ్డి పెద్ద ప్లాన్!

తెలంగాణ యువతలో నైపుణ్యాలు పెంచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం స్కిల్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసింది. అసెంబ్లీ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. 17 కోర్సులతో వర్సిటీని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 5, 2024 / 04:28 PM IST

    CM Revanth Reddy

    Follow us on

    CM Revanth Reddy : తెలంగాణలో నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసింది. ఇటీవలే దీనిని సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. ఆగస్టు 1న రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ఈ యూనివర్సిటిని ఏర్పాటు చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు అసెంబ్లీలో తెలిపారు. యువతకు ఉపాధితో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. ఇలా నిరుదోగ్య యువత కోసం ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్కిల్‌ వర్సిటీకి చైర్మన్‌ను నియమించారు. ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్ర అండ్‌ మహీంద్రా చైర్మన్‌ను.. స్కిల్‌ యూనివర్సిటీ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి ఈమేరకు ప్రకటన చేశారు. రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు.

    యూనివర్సిటీ ప్రత్యేకతలు..
    ఇక స్కిల్‌ యూనివర్సిటీ కోసం ప్రభుత్వం 57 ఎకరాల స్థలం కేటాయించింది. రూ.100 కోట్ల నిధులు విడుదల చేసింది. పబ్లిక్‌ ప్రైవేట్‌ (పీపీ) భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీ నిర్మించనున్నారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించనున్నారు. మొత్తం 17 కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోని ఈ స్కిల్‌ యూనివర్సిటీకి ఆనంద మహేంద్రాను చైర్మన్‌గా నియమించారు. రెండ రోజుల క్రితమే సీఎం రేవంత్‌రెడ్డితో ఆనంద్‌ మహీద్రా సమావేశమయ్యారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో ఆటోమోటివ్‌ విభాగాన్ని దత్తత తీసుకునేందుకు అంగీకరించారు. త్వరలోనే స్కిల్‌ యూనివర్సిటీని పరిశీలించేందుకు తన బృందాన్ని పంపుతానని తెలిపారు. ఈ క్రమంలో చైర్మన్‌గా కూడా ఆనంద్‌ మహీంద్రనే ప్రభుత్వం నియమించింది.

    ఆనంద్‌ మహీంద్రా గురించి..
    ఇక ఆనంద్‌ గోపాల్‌ మహీంద్రా (జననం 1 మే 1955) ఒక భారతీయ బిలియనీర్‌ వ్యాపారవేత్త. ముంబై ఆధారిత వ్యాపార సమ్మేళనం అయిన మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఏరోస్పేస్, అగ్రిబిజినెస్, అనంతర మార్కెట్, ఆటోమోటివ్, భాగాలు, నిర్మాణ పరికరాలు, రక్షణ, శక్తి, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక మరియు భీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, విశ్రాంతి మరియు ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్‌ ఎస్టేట్‌ మరియు రిటైల్‌. మహీంద్రా మహీంద్రా – మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్‌ చంద్ర మహీంద్రా మనవడు . 2023 నాటికి, ఫోర్బ్స్‌ ప్రకారం అతని నికర విలువ రూ.2.1 బిలియన్లు. ఆనంద్‌ మహీంద్రా హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థి .1996లో ఆనంద్‌ మహీంద్రా భారతదేశంలో నిరుపేద బాలికల విద్యకు మద్దతు ఇచ్చే నాన్హి కాలీ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించాడు. 2011 ఆసియాలోని 25 అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాలో ఉన్నాడు.

    నైపుణ్యం లేకనే..
    తెలంగాణలో యువత ఎక్కువగా ఉన్నా.. వారిలో నైపుణ్యం లేకపోవడంతో చాలా మంది ఉన్నత చదువులు చదివినా ఉపాధి పొందలేకపోతున్నారు. ఇలాంటి వారు డ్రగ్స, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం భావించింది. వారికి ఉపాధి కల్పిస్తే.. డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలు తగ్గుతాయన్న ఆలోచనతోనే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీలో తరగతులు ప్రారంభించనున్నారు.

    ఎన్‌ఆర్‌ఐలతో భేటీ..
    ఇక తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పది రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు. అక్కడి ఎన్నారైలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలను ఆహ్వానించారు. అమెరికా పర్యటన తర్వాత ఈనెల 13న ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఆయన వెంట అధికారులతోపాటు మంత్రులు కూడా ఉన్నారు.