Barrelakka: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఇండిపెండెట్ అభ్యర్థిగా పోటీ చేసిన శిరీష (బర్రెలక్క) ముందంజలో ఉన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో బర్రెలక్క ముందంజలో ఉండడం ఆసక్తిగా మారింది. కొల్లపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బరిలో ఉన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా హర్షవర్దన్ రెడ్డి, బీజేపీ నుంచి అల్లెని సుధాకర్ రావు పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా.. ఇక్కడ టీడీపీ ఒకసారి, టీఆర్ఎస్ రెండు సార్లు విజయం సాధించింది. ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా జూపల్లి కృష్ణారావు అత్యధికంగా 5 సార్లు గెలిచారు. ఈసారి బర్రెలక్కల స్వతంత్ర అభ్యర్థిగా గెలిస్తే చరిత్ర సృష్టించనున్నారు.
నామినేషన్ వేసిన సమయంలో శిరీషను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత ఆమెకు విపరీతంగా మద్దతు పెరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఫాలోయింగ్ పెరిగింది. నియోజకవర్గంలోనూ తనకు ప్రచారం చేయడానికి డబ్బులు లేవని తెలపడంతో విదేశాల నుంచి సైతం ఆమెకు నగదు సాయం చేశారు.
అలాగే ఏపీ నుంచి జేడీ లక్ష్మీ నారాయణ వంటివారు అమెకు మద్దతుగా ప్రచారం చేయడంతో చాలా మందిని ఆకర్షించారు. కొల్లాపూర్ నియోజకవ్గంలో ఆమె గెలవకపోయినా మిగతా అభ్యర్థులను ప్రభావం చేస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు ముందంజలో ఉండడంతో ఆసక్తి పెరిగింది. అయితే చివరి రౌండ్ వరకు ఆమె ఓట్ల పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.