HomeతెలంగాణInduru Municipal Corporation elections: ఇందూరు.. ఎవరిదో..?

Induru Municipal Corporation elections: ఇందూరు.. ఎవరిదో..?

Indur Municipal Corporation elections: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో మరో కీలక కార్పొరేషన్‌ నిజామాబాద్‌(ఇందూరు). తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ మూడు ఎమ్మెల్యేలను గెలిచింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్‌ రెండోసారి ఎంపీగా గెలిచారు. ఇందూరుపై పట్టు సాధించారు. దీంతో ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్యే గట్టి పోటీ నడుస్తోంది. పదేళ్లు పుర పీఠం దక్కించుకున్న బీఆర్‌ఎస్‌ ఈసారి మరింత డీలాపడింది.

అన్నీ రవిందే..
మున్సిపల్‌ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ బలంగా కనిపిస్తోది. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఉండడం బీజేపీకి ప్లస్‌. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం అదనపు బలం. ఇక ఇక్కడ కాంగ్రెస్‌ కూడా బలంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెజారిటీ స్థానాలు సాధించింది. అయితే ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో మాత్రం బీజేపీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ ధర్మపురి అరవింద్‌ అన్నీ తానై చూసుకుంటున్నారు. ఇందూరు బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపికలోనూ ఆయనే కీలకంగా వ్యవహరించారు. గత ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ 28 కార్పొరేటర్లను గెలిచింది. బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఈసారి కచ్చితంగా గెలుస్తుందన్న అభిప్రాయం ప్రజల్లోనూ ఉంది. 60 డివిజన్లు ఉన్న బల్దియాలో 35 నుంచి 40 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌ గట్టి పోటీ..
ఇక నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ కూడా గట్టి పోటీ ఇస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఆ పార్టీకి కలిసి వస్తోంది. ఇక సీఎం రేవంత్‌రెడ్డి నిజాబాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం కోసం సభ నిర్వహించారు. బైపాస్‌ మంజూరు చేస్తానని, విమానాశ్రయం తెస్తానని పట్టణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ కార్పొరేషన్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేలా కష్టపడుతున్నారు. అయితే కాంగ్రెస్‌ ఈసారి 20 నుంచి 25 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా.

ఎంఐఎం కీలకం..
గత మున్సిపల్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌లో 16 కార్పొరేషన్లు గెలిచింది. బీఆర్‌ఎస్‌ 13 స్థానాలు గెలిచింది. ఇక్కడ హిందూఇజం ఎంత బలంగా ఉందో.. ముస్లింలు కూడా అంతే బలంగా ఉన్నారు. దీంతో ఈసారి కూడా ఎంఐఎం 10 నుంచి 15 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్, ఎంఐఎం అవాగాహన ఉండడం ఎంఐఎంకు ప్లస్‌పాయింట్‌.

నామమాత్రంగా బీఆర్‌ఎస్‌..
ఇక ఇందూరులో బీఆర్‌ఎస్‌ పోటీ ఈసారి నామమాత్రమే కాబోతోంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పెద్దగా ఏమీ చేయలేదన్న అభిప్రాయం ఉంది. ఇక ఈసారి రాష్ట్రలో అధికారంలో లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌. ఇంకా పెద్దమైనస్‌ అంటే.. కేసీఆర్‌ తనయ, నిజాబాబాద్‌ కోడలు బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయడం ఆ పార్టీకి పెద్ద మైనస్‌. దీని ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ 5 నుంచి 10 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version