Ola Cabs Fined By Court: క్యాబ్ నిర్వహణ సంస్థ ‘ఓలా’కు కోర్టు భారీ జరిమానా విధించింది. ఈ సంస్థకు చెందిన క్యాబ్ లో ప్రయాణికుడికి అవసరం కంటే అధికంగా చార్జ్ చేసినందుకు జరిమానాగా రూ.95 వేలు చెల్లించాలని హైదరాబాద్ కు చెందిన వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు వినియోగదారుడు చేసిన ఫిర్యాదుకు ‘ఓలా’ ప్రతినిధులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో సీరియస్ గా తీసుకున్న కోర్టు ఫిర్యాదుదారుడి వద్ద వసూలు చేసిన మొత్తానికి 12 శాతం వడ్డీ చెల్లించి ఇవ్వాలని ఆదేశించింది. కన్జ్యూమర్ విషయంలో ‘ఓలా’ ప్రతినిధుల ప్రవర్తన బాగా లేదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యలు చేసింది.

హైదరాబాద్ కు చెందిన శామ్యూల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి 2021 అక్టోబర్ లో ‘ఓలా’ క్యాబ్ ఎక్కాడు. ఈ దంపతులు కలిసి 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు ప్రయాణించారు. అయితే ‘ఓలా’ క్యాబ్ వారు కిలోమీటర్ కు 20 నుంచి 25 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన 5 కిలోమీటర్లకు మహా అయితే 100 నుంచి 150 లోపు అవుతుంది. కానీ శామ్యూల్ ప్రయాణించిన కారు డ్రైవర్ రూ.861 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అంతకుముందే కారు డ్రైవర్ ప్రవర్తన బాగా లేదని శామ్యూల్ ఆరోపించారు. ఏసీ వేయాలని కోరినప్పటికీ అతను పట్టించుకోలేదని తెలిపాడు. దీంతో డ్రైవర్ ప్రవర్తనతో శామ్యూల్ కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు.
Also Read: CJI NV Ramana- Jagan: సీజేఐ, సీఎం జగన్..లోపల ఎంత పగలున్నా పైకి ‘విందు’.. తప్పదు మరీ

శామ్యూల్ అంతకుముందే ‘ఓలా’ యాజమాన్యాన్ని కలిసినా ప్రయోజనం లేకపోయింది. తనకు అనవసరంగా చార్జీ చేశారని చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆయన కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే హైదరాబాద్ వినియోగదారుల కోర్టు ‘ఓలా’ యాజమాన్యానికి నోటీసులు పంపింది. కానీ ఈ నోటీసులను ‘ఓలా’ ప్రతినిధులు పట్టించుకోలేదు. సుదీర్ఘ కాలం గడువు ఇచ్చినా వారు నిర్లక్ష్యం చేశారు. దీంతో వినియోగదారుడి ఇబ్బందిని గుర్తించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
తుది విచారణ జరిపిన తరువాత వినియోగదారుడికి కోర్టు ఫీజుల కింద రూ.7 వేలు, నష్టపరిహారం కింద రూ.88 వేలు ఇవ్వాలని ‘ఓలా’ను ఆదేశించింది. అంతేకాకుండా ఫిర్యాదుదారుడిని నుంచి వసూలు చేసిన రూ.861లను కూడా 12 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని తెలిపింది. కోర్టు జరిమానా వేసినప్పటికీ ‘ఓలా’ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరి ఈ విషయంలో కోర్టు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Also Read:CM Jagan- Welfare Schemes: జగన్ అంతే.. ప్రకటనలతోనే పాలన
[…] […]
[…] […]