Virender Sehwag: క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్ ఎవరంటే కచ్చితంగా చెప్పే పేరు వీరేంద్ర సెహ్వాగ్. మ్యాచ్ ఏదైనా చెలరేగి ఆడటమే అతడి నైజమే. టెస్ట్ అయినా వన్డే అయినా అతడి బ్యాటింగ్ లో తేడా ఉండదు. ఒకటే బాదుడు. బౌలర్ ఎవరైనా లెక్కలేదు. తన బ్యాట్ తో పరుగుల వరద పారించడమే అతడికి అలవాటు. టెస్ట్ మ్యాచ్ లో త్రిబుల్ సెంచరీ చేసే క్రమంలో స్కోరు 299 ఉండగా సిక్స్ కొట్టి అందరిలో ఆశ్చర్యం నింపాడు. అలాంటి కచ్చితమైన ఆటగాడు సెహ్వాగ్ కావడం గమనార్హం. అతడి ఆటతీరు చూస్తుంటే అందరికి అనుమానం కలిగేది.

సెహ్వాగ్ ఉన్నాడంటే మ్యాచ్ ఫలితం మారేది. పరుగుల వరదలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. బాల్ ఏదైనా అది బౌండరీ పోతుందో లేక సిక్స్ వెళ్తుందో తెలిసేది కాదు. అంతటి ప్రతిభ గల ఆటగాడిగా సెహ్వాగ్ కు పేరుంది. ఫార్మాట్ ఏదైనా తన బ్యాట్ తో సమాధానం చెప్పడమే సెహ్వాగ్ నైజం. అతడి దూకుడును గమనించిన ఓ బౌలర్ కెప్టెన్ కు సలహా ఇచ్చాడు. సెహ్వాగ్ ను ఓపెనర్ గా పంపాలని సూచించాడు. దీంతో గంగూలీ సెహ్వాగ్ ను ఓపెనర్ గా పంపించి చూశాడు. అతడు చేసిన ప్రయత్నం బ్రహ్మాండంగా ఉండటంతో ఇక సెహ్వాగ్ ఓపెనర్ గా రాణించాడు. ఎన్నో మ్యాచ్ ల్లో ఫలితం వచ్చేలా చేసి ఎన్నో కప్ లు గెలిచేందుకు పరోక్షంగా దోహదపడ్డాడు.
సెహ్వాగ్ లోని దూకుడును గమనించిన బౌలర్ ఎవరో కాదు జహీర్ ఖాన్. సెహ్వాగ్ ఆటతీరును గమనించిన అతడు గంగూలీకి సెహ్వాగ్ ను ఓపెనర్ గా పంపాలని సలహా ఇచ్చాడట. దీంతో గంగూలీ పాటించి సెహ్వాగ్ ను ఓపెనర్ గా చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 1999లో మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ గా ఉన్న సెహ్వాగ్ స్పీడ్ ను చూసిన జహీర్ ఖాన్ తనను ఓపెనర్ గా పంపితే మంచి ఫలితాలు ఉంటాయని గంగూలీకి చెప్పాడట. దీంతో జహీర్ ఖాన్ సూచన మేరకు గంగూలీ సెహ్వాగ్ ను ఓపెనర్ గా పంపించడంతో మంచి ఫలితాలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి ఓపెనర్ గా స్థిరపడిపోయాడట.

ఆసియా కప్ ప్రారంభోత్సవానికి ముందు స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో షోయబ్ అక్తర్ తో కలిసి పాల్గొన్న వీరేంద్ర సెహ్వాగ్ తన మనసులోని మాటలను పంచుకున్నాడు. టీమిండియాలో తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్న ఆటగాడిగా సెహ్వాగ్ కు గుర్తింపు తీసుకొచ్చింది. టీమిండియాలో సమర్థవంతమైన ఓపెనర్ గా సెహ్వాగ్ తనదైన పాత్ర పోషించి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందుకున్నాడు. జహీర్ ఖాన్ చెప్పిన సూచన గంగూలీ పాటించిన తీరుతో తనకు ఓపెనర్ స్థానం దక్కినట్లు చెప్పాడు.
Also Read:CJI NV Ramana- Jagan: సీజేఐ, సీఎం జగన్..లోపల ఎంత పగలున్నా పైకి ‘విందు’.. తప్పదు మరీ