Indiramma Housing Scheme : రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబి‍్ధదారుల జాబితాలో మన పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి ఆఫాసులు, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అరచేతిలోఉండే మొబైల్ సాయంతో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు, మంజూరు, ఏ దశంలో ఉందో తెలుసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. గ్రామ సభల ద్వారా ఆన్‌లైన్ వేదికగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు స్వీకరించింది. కొందరికి మంజూరు కూడా అయ్యాయి. అయితే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ఏ దశలో ఉంది.. ఆర్థిక సాయం ఎప్పుడు వస్తుంది. ఇళ్ల నిర్మాణానికి ఏం చేయాలనే వివరాలు తెలుసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తు ఏదశలో ఉంది. ఇంటి కోసం సర్వే నిర్వహించారా లేదా.. ఇల్లు మంజూరైందా లేదా.. వంటివి ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. మంజూరైన ఇల్లు ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలో ఉందా అనే విషయం తెలుసుకోవడం చాలా సులువు. ఏ కారణంతో ఇల్లు మంజూరు కాలేదు అనే వివరాలు కూడా తెలుసుకునేలా ప్రభుత్వం పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసింది.
ఆన్‌లైన్‌లో ఇలా..
ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్‌ను దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల వద్దకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. వ్యక్తిగత పనులు వదిలి మరీ ప్రభుత్వ కార్యాలయా చుట్టూ తిరగకుండా మొబైల్ ఫోన్‌లో వివరాలు తెలుసుకునే విధానం చాలా సులువు. ఆధార్ నంబర్/మొబైల్ నంబర్/రేషన్ కార్డు నంబర్‌తో ఇందిరమ‍్మ ఇళ్ల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన https://indirammaindlu.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చు. వెబ్‌సైట్ తెరిచాక గ్రీవెన్స్ స్టేటస్‌ను ఎంచుకోవాలి. తర్వాత సెర్చ్‌లోఇ వెళ్లి అక్కడ ఆధార్/ఫోన్ లేదా రేషన్‌కార్డు నంబర్ ఎంటర్‌చేయాలి. తర్వాత సంబంధించిన వివరాలు వస్తాయి. కనిపించిన వివరాల్లో ఇందిరమ్మ ఇళ్లు దరఖాస్తుల ప్రక్రియ ఎలా ఉందో తెలుస్తుంది. దరఖాస్తుదారులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెబ్‌సైట్ ద్వారా తెలపాల్సి ఉంటుంది.